దేవరగట్టు మాళ మల్లేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తాం…
1 min read

తెదేపా ఇంచార్జి వైకుంఠం జ్యోతి….
వైభవంగా దేవరగట్టు ఆలయ కమిటీ ప్రమాణస్వీకారోత్సం….
చైర్మన్ గా కురువ వీర నాగప్ప…
వైస్ చైర్మన్ గా లోక్య నాయక్…
హొళగుంద న్యూస్ నేడు : రాష్ట్రంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన దేవరగట్టు మాళ మల్లేశ్వర స్వామి ఆలయ నిర్వహణ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇంచార్జి వైకుంఠం జ్యోతి, టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వైకుంఠం శివప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా దేవరగట్టు మాళ మల్లేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆలూరు టిడిపి ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి,వైకుంఠం శివప్రసాద్ మాట్లాడుతూ చరిత్రలో ఎన్నడు లేని విధంగా దేవరగట్టు ఆలయ నిర్వహణ గ్రామాలకు చెందిన వ్యక్తులను చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యులుగా నియమించినట్లు తెలిపారు.గతంలో కొంతమంది నాయకులు వారి కుటుంబ సభ్యులను చైర్మన్గా నియమించే వారని విమర్శించారు. అలా కాకుండా స్థానికులకు ప్రాధాన్యం కల్పిస్తే ఆలయ అభివృద్ధికి దోహదపడుతారనే సదుద్దేశంతో నేరనికి గ్రామానికి చెందిన కురువ వీరనాగప్పను ఆలయ కమిటీ చైర్మన్గా, తాండ గ్రామానికి చెందిన లోక్య నాయక్ ను వైస్ చైర్మన్ గా,నేరనికి,నేరనికి తాండా,కొత్తపేట గ్రామాలకు చెందిన వ్యక్తులనే ఆలయ కమిటీ సభ్యులుగా నియమించినట్లు తెలిపారు. కొత్తగా ఎన్నికైన కమిటీ సభ్యులు ఆలయ అభివృద్ధికి తోడ్పడాలని ఆలయ అభివృద్ధి కొరకు తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. ఆలయ పరిధిలో కోటి రూపాయల నిధులతో సిసి రోడ్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వారు తెలిపారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకోరావాలని, ఎలాంటి ఇబ్బందులు ఉన్న చర్చించి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు.అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు,ఆయా గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



