NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అందరి సహకారంతోనే అభివృద్ధి చేస్తున్నా

1 min read

కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం

సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే

నందికొట్కూరు, న్యూస్​ నేడు:  అధికారులు ప్రజాప్రతినిధుల సహకారంతోనే అభివృద్ధి చేస్తున్నానని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఎంపీపీ మురళీకృష్ణారెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది.ఈ సమావేశానికి ఎమ్మెల్యే మరియు మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి, సొసైటీ చైర్మన్లు హరి సర్వోత్తమ్ రెడ్డి,ముర్తు జావలి,ఎంపీడీవో సుబ్రహ్మణ్యం శర్మ మరియు అధికారులు హాజరయ్యారు.ఈ సందర్భంగా పశువైద్య అధికారి మాట్లాడుతుండగా దామగట్ల,మల్యాల,శాతన నకోట గ్రామాలకు మీరు సరిగ్గా వెళ్ళటం లేదని గ్రామాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని పశువైద్య అధికారితో ఎమ్మెల్యే అన్నారు.ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా చూడాలన్నారు.చేప పిల్లలనుఇతరులు తీసుకువెళ్తుంటే మీరేం చేస్తున్నారని మత్స్య శాఖ అధికారిని ఎమ్మెల్యే మందలించారు.కేసీ కెనాల్ కు రెండు పంపులు నీళ్లు వదలాలని కేసీ కెనాల్ అధికారిని ఎమ్మెల్యే ఆదేశించారు.ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాజముద్ర పాస్ పుస్తకాలను రైతులకు అందించామని పొరపాట్లు ఉంటే వాటిని సరి చేసేందుకు మళ్లీ ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. శాతనకోట సర్పంచ్ జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ ఆర్టీసీ బస్సులు బస్టాండ్ కు రాకుండా హైవే రోడ్డుపైనే వెళ్ళటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అనగా స్పందించిన ఎమ్మెల్యే డిపో మేనేజర్ సమావేశానికి రాకుండా డ్రైవర్ ను సమావేశానికి పంపడం పట్లఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా సమావేశాలకు రావాల్సిందేనని సిమెంట్ రోడ్లు త్వరితగతిన పూర్తి పంచాయతీరాజ్ ఏఈని ఎమ్మెల్యే ఆదేశించారు. కొల్లబావాపురం సర్పంచ్ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ నేను సర్పంచ్ అయ్యాక మొదటి సమావేశంలో స్తంభాలు కావాలని చెప్పినా ఐదేళ్లు దాటినా కూడా కరెంట్ స్తంభాలు రాలేదన్నారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాసులు,ఏవో షేక్షావలి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ వేణు మాధురి,ఐసిడిఎస్ మరియు వివిధ శాఖల మండల అధికారులు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

About Author