NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చాకలి ఐలమ్మ 130వ జయంతి  వేడుకలు

1 min read

హొళగుంద న్యూస్ నేడు : స్థానిక మడివాల మచిదేవుని గుడి దగ్గర రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ చిత్ర పటానికి కురుకుంద నాగరాజు పులమాల వేసి నివాలుర్పించడం సంఘం నాయకులకు లక్ష్మన్న మల్లికార్జున నాగరాజు మల్లి వీరేష్ మాట్లాడుతూ1895 సెప్టెంబర్ 26న వరంగల్ జిల్లా, రాయపర్తి మండలం క్రిష్టాపురం గ్రామంలో జన్మించితెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నాయకత్వం వహించిన వీర మహిళ.భూమి సమస్యలు, భుక్తి, వెట్టి చాకిరి వంటి అంశాలకు వ్యతిరేకంగా పోరాడారు.ఆమె ధైర్యం, త్యాగం తెలంగాణ పోరాటానికి ఆదర్శం.మహిళా చైతన్యం, సామాజిక సమానత్వం, రైతాంగ హక్కులు, అణగరిన వర్గాల బలోపేతానికి చాకలి ఐలమ్మ జయంతి ప్రేరణగా నిలుస్తుంది.ఐలమ్మ స్పూర్తితెలంగాణ పోరాట చరిత్రలో ఐలమ్మది అపూర్వ స్థానం.జయంతి సందర్భంగా ఆమె జీవితాన్ని స్పృహపర్చే కార్యక్రమాలు, విద్యా పాఠ్యాంశాల్లో చేర్చడం లాంటి చర్యలు చేపడుతున్నారు.చాకలి ఐలమ్మ జయంతి తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవం, పోరాట స్ఫూర్తి, సామాజిక సమానత్వానికి గుర్తుగా ప్రతి ఏడాది ఘనంగా జరుపుకోవాలని కోరారు.

About Author