NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీశైలంలో విస్తీత తనిఖీలు

1 min read

గోబి మంజూరియా, రంగు కలిపి బఠాణీల గుర్తింపు

  • కర్నూలు ఆహార భద్రత అధికారి రాజ గోపాల్​ రావు

శ్రీశైలం , న్యూస్​ నేడు:ఉగాది పర్వదినం పురస్కరించుకుని ఆహార భద్రత ఉన్నతాధికారి , కమిషనర్​, రాష్ట్ర డైరెక్టర్​ ఆదేశాల మేరకు  శ్రీశైలంలో ఆహార భద్రత అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. బుధవారం గోబి మంజూరియా, చిరుతిండ్ల బండ్లు, హోటళ్లపై   కర్నూలు ఆహార  భద్రత అధికారి రాజగోపాల్​ రావు పరిశీలించారు. గోబీ మంజూరియాలో నిషేధిత రంగు కలిపిన పదార్థాలు, రంగు కలిపి బఠాణీలను ప్రజలకు విక్రయిస్తున్నారని గుర్తించి… వాటిని చెత్త బుట్టలో పడేశారు. ఈ సందర్భంగా ఆహార భద్రత అధికారి రాజ గోపాల్​ రావు మాట్లాడుతూ  సింథటిక్​ పదార్థాలు , రసాయనాలు కలిపిన ఆహారం, బఠాణీలు విక్రయిస్తే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిదంగా ప్లాస్టిక్​ కవర్లు ఉపయోగించరాదని ఆదేశించారు. శ్రీశైలంలోని పాతాళ గంగకు వెళ్లే రహదారిలో రుద్రప్ప హోటలు, అయ్యన్న హోటలు, ఎస్​బిఎంఎస్​ ఫుడ్​ కోర్టు , రమేష్​ హోటల్​ లో  పరిశీలించగా గోబిమంజూరియా లో సింథటిక్​ రంగు కలిపారని, రంగులు కలిపిన బఠాణీలు విక్రయిస్తున్నారని, వాటిని గుర్తించి చెత్త బుట్టలో పడేశామని ఈ సందర్భంగా ఆహార భద్రత అధికారి రాజ గోపాల్​ రావు వెల్లడించారు.

About Author