NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంట్ లో బిల్లు ఆమోదం పై హర్షం

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొందిన శుభ సందర్భంగా  మాజీ కేంద్ర మంత్రివర్యులు, టిడిపి జాతీయ ఉపాధ్యక్షులు, డోన్ నియోజకవర్గ శాసనసభ్యులు  కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు ప్యాపిలీ పట్టణంలోని టిడిపి కార్యాలయంలో నుండి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించి రాజధానికి అమరావతి రాజధానిగా పార్లమెంట్లో చట్టం ఏర్పడడం పట్ల ప్యాపిలి మండలం టిడిపి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు సహకరించిన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ కి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, డిప్యూటీ ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ కి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ కి కూటమి నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో తేదేపా మండల ఇన్చార్జి ఎద్దుల దొడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివాసులు, మాజీ డోన్ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజా నారాయణమూర్తి, మండల కన్వీనర్ సుదర్శన్,పట్టణ కన్వీనర్ కొంగనపల్లి మధు, తేదేపా జనరల్ సెక్రెటరీ నడిగడ్డ నాగేంద్ర, తెదేపా ఎస్టీ సెల్ అధికార ప్రతినిధి మదు కుమార్, బిజెపి మండల అధ్యక్షుడు దామోదర్ నాయుడు, బిజెపి నాయకులు కెసి మద్దిలేటి, తేదేపా నాయకులు క్రిష్ణ మూర్తి,కడితం ప్రతాప్ రెడ్డి, ఎస్ కే వలి, బ్యాంక్ శ్రీను,పోతుదోడ్డి కదిరప్ప, నారాయణ, బాలకృష్ణ,ఆర్సీ మద్దిలేటి ,బాలరంగన్న  కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

About Author