NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సీఎం సారు రోడ్డు మంజూరు చేయండి

1 min read

రోడ్డు లేక… బస్సులు రాక… ప్రజలు… విద్యార్థుల ఇబ్బందులు

హొలగుంద ధణాపురం డబుల్ రోడ్డు కోసం వాల్మీకి యువ నేత  హెబ్బటం శ్రీనివాసులు వినతి

హొళగుంద న్యూస్ నేడు : ప్రధాన సమస్యగా మారిన హొళగుంద ధణాపురం రోడ్డును వెంటనే మంజూరు చేసి ప్రజల ఇబ్బందులు తొలగించాలని వాల్మీకి యువ నేత హెబ్బటం  శ్రీనివాసులు ముఖ్యమంత్రిని విన్నవిస్తున్నట్లు తెలిపారు. గత రెండు దశాబ్దాలుగా రోడ్డు వ్యవస్థ సరిగా లేక ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతూనే  ప్రయాణాలు చేశారని అయితే ప్రస్తుతం వాహనాలు తిరగలేని పరిస్థితికి రోడ్డు చేరిందని ప్రతిరోజు ఈ మార్గంలో తిరిగి ఆర్టీసీ బస్సులు  అద్వాన స్థితిలో ఉన్న రోడ్డు వల్ల ఎక్కడో ఒకచోట చెడిపోయి ఆగిపోతున్నాయని ఆ సమయంలో ఆ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు  ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గడచిన ప్రభుత్వ కాలం నుంచి  హొలగుంద ధనాపురం డబల్ రోడ్డు కావాలని మంజూరు కోరుతూ  అధికారులకు నాయకులకు మండల ప్రజలు యువ సంఘాలు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు వినిపిస్తూనే ఉన్నాయని  అయితే రోడ్డు మాత్రం నిర్మాణం కాలేదని పేర్కొన్నారు. రోడ్డు సరిగా లేకపోవడంతో ఆర్టీసీ వారు  బస్సులను నడపడానికి  సుముఖంగా లేరని రోడ్డుకు తగ్గట్టుగా పాత బస్సులను  ఈ మార్గంలో నడుపుతున్నారని తెలిపారు. మండల కేంద్రం హోలగుందలో ఉన్నటువంటి  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రైవేట్ డిగ్రీ కళాశాలలకు  ప్రతిరోజు మండల పరిధిలోని చుట్టుపక్కల గ్రామాల నుంచి 300 కు పైగా విద్యార్థులు వస్తారని రోడ్లు సరిగా లేక బస్సులు సమయానికి నడవకపోవడంతో విద్యార్థులు తరగతులకు సరైన సమయంలో హాజరు కాలేకపోతున్నారని అందువల్ల వారికి హాజరులో ఆబ్సెంట్ పడుతుండడంతో హాజరు తగ్గిపోయి పరీక్షలకు కూర్చోబెట్టారన్న భయంతో విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారని ప్రభుత్వ అధికారులు విద్యార్థుల సమస్యను  పరిష్కరించాలని కోరారు. రోడ్డు అద్వాన స్థితికి మారడంతో  గంటసేపు ప్రయాణ సమయం కలిగిన ప్రయాణం రెండు గంటలు పడుతుందని తెలిపారు. దీనివల్ల ప్రజలు అత్యవసర సమయాలలో నష్టపోతున్నారని ప్రజల సమస్యను గుర్తించి వెంటనే హొళగుంద ధనాపురం డబుల్ రోడ్డు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ని కోరుతున్నట్లు వాల్మీకి యువనేత వాల్మీకి శ్రీనివాసులు తెలిపారు.

About Author