శ్రీ భక్త కనకదాసు విగ్రహం ధ్వంసం చేసినవారిని అరెస్టు చేయాలి..
1 min read

ఆలూరు న్యూస్ నేడు : ఆలూరు అంబేద్కర్ సర్కిల్ లో మదాసి మాదరి కురువ సంఘం ఆధ్వర్యంలో మానేకుర్తి గ్రామం లో కురువలు ఆరాధ్య దైవం శ్రీ భక్త కనక దాస్ విగ్రహం పగలుకొట్టిన గుర్తుతెలియని దుండగలను వెంటనే అరెస్టు చేయాలనీ ధర్నా చేసి ఆలూరు యస్ఐ మహేబూబ్ బాషా వినతి పత్రం అందజేశారు మదాసి మాదరి కురువ సంఘం నాయకులు యస్ కె గిరి కమ్మరచేడు దేవేంద్రప్ప మాట్లాడుతు మానేకుర్తి గ్రామం లో కురువల ఆరాధ్య దైవం శ్రీ భక్త కనక దాస్ విగ్రహం చెయ్యి పగల కొట్టడం కురువల అందరి మనోభావాలు దెబ్బతినే విదంగా ఉన్నాయి భవిష్యత్ లో ఇలాంటి ఎక్కడ కాకుండా చూడాలని శ్రీ కనక దాస్ విగ్రహం పగలుకొట్టిన వ్యక్తులు వెంటనే అరెస్టు చేసి శిక్షంచాలిని డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమం లో దేవేంద్ర ,అయ్యాలాప్ప, మల్లికార్జున, మహానంది, లింగ నాగేంద్ర, మంగన్న, చంద్ర, ఉలేతప్ప, కురువ కులస్తులు పాల్గొన్నారు.


