NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజలకు చేరువగా పేదల సేవలో కూటమి ప్రభుత్వం

1 min read

హోళగుంద న్యూస్ నేడు: ఆలూరు తాలూకా తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి ఆదేశాల మేరకు మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ వైకుంఠం శివప్రసాద్ ఆదేశాలతోఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో  హెబ్బటం గ్రామ  టీడీపీ కూటమి నాయకులు .ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు హొళగుంద మండలసింగిల్ విండో చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం ఒక రోజు ముందుగానే రాష్ట్రవ్యాప్తంగా చేపట్టినటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేయడం జరిగింది, పెన్షన్లను అందుకున్న వృద్ధులు, వితంతులు, వికలాంగులు, అంధులు, మరియు ఇతర లబ్ధిదారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు టిడిపి యువ నాయకులు నారా లోకేష్ గారికి మరియు ఆలూరు తాలూకా టిడిపి ఇన్చార్జ్  వైకుంఠం జ్యోతి కి కృతజ్ఞతలు తెలిపారు,హొళగుంద మండలం హెబ్బటం గ్రామం నందు ఆలూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కె. గోపాల్,టీడీపీ  యూనిట్ ఇంచార్జ్  ,ఉప సర్పంచ్ బి.సవారప్ప, క్లస్టర్ ఇంచార్జ్ 1,బి. మల్లికార్జున,బూత్ కన్వీనర్ లు శేక్షవలి,శీను,శ్రీకాంత్,గ్రామ ఉపాధ్యక్షులు సూగురు నాగయ్య,గ్రామ ఆర్గనైసింగ్ సెక్రటరీ శేఖర్,గ్రామ కార్యదర్శి మాణిక్య,బూత్ కో కన్వీనర్ రవి, సవారి, మరియు సచివాలయం సిబ్బంది పాల్గొనడం జరిగినది.

About Author