NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చేనేత కుటుంబాలకు ఉచిత విద్యుత్  కరపత్రాలను  కలెక్టర్ అధికారికంగా విడుదల

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు : చేనేత సంక్షేమం లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేనేత కుటుంబాలకు నెలకు 200 యూనిట్లు, పవర్లూమ్ యూనిట్లకు నెలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తోందని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి పేర్కొన్నారు.ఈ సందర్భంగా  కలెక్టరేట్ లో ఉచిత విద్యుత్ పథకం”కు సంబంధించిన కరపత్రాలను జిల్లా  కలెక్టర్ అధికారికంగా విడుదల చేశారు.  07 మంది ఉచిత విద్యుత్ పథకం లబ్దిదారులకు ధృవపత్రాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ గారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం  “ఉచిత విద్యుత్ పథకం” ద్వారా చేనేత కుటుంబాలకు నెలకు 200 యూనిట్లు, పవర్లూమ్ యూనిట్లకు నెలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తోందని,  ఈ పథకం ద్వారా ఒక్కొక్క చేనేత కుటుంబానికి నెలకు రూ. 720/- చొప్పున సంవత్సరానికి మొత్తం రూ.8640/- మరియు ఒక్కొక్క పవర్ లూం యూనిట్ నిర్వాహకులకు నెలకు రూ.1800/- చొప్పున సంవత్సరానికి మొత్తం రూ.21,600/- ఆర్థికంగా లబ్ది కలుగుతుందని తెలిపారు. కర్నూలు జిల్లాలో ఈ పథకం ద్వారా 2457 చేనేత కుటుంబాలకు మరియు 01 మరమగ్గ కుటుంబానికి లబ్ది కలుగుతుందని తెలిపారు.ఈ పథకం ద్వారా చేనేత కార్మికులపై విద్యుత్ వ్యయం భారం తగ్గి, వారి జీవనోపాధి మెరుగుపడటంతో పాటు ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని, గ్రామీణ ఉపాధికి ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. అలాగే, చిన్న మరియు గృహాధారిత చేనేత కార్మికులకు ఈ పథకం ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీ జి.నాగరాజా రావు, జిల్లా చేనేత మరియు జౌళి శాఖ అధికారి, కర్నూలు & నంద్యాల, శ్రీ వి.నరసింహా రెడ్డి, అభివృద్ధి అధికారి(చే. జౌ) మరియు సహాయ అభివృద్ధి అధికారులు(చే.జౌ), చేనేత కార్మికులు, నాయకులు పాల్గొన్నారు.

About Author