NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీ రామాలయం,పేట  వార్షిక బ్రహ్మోత్సవాలలో నేడు గజవాహన సేవ

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూలు పాత నగరం మైన్ బజార్, లో గత సం.100 వ సం. వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించుకున్న పేట రామాలయం లో ఈరోజు చైత్ర శుద్ధ విదియ  సందర్భంగా అంగరంగ వైభవంగా 101 వ వార్షిక బ్రహ్మోత్సవాలో భాగంగా, 2 వరోజు ఉ 5 గం.లకు  ఆలయ ప్రధానార్చకులు మాళిగి హనుమేషాచార్యుల వారి ఆధ్వర్యంలో స్వామి వారికి సుప్రభాత సేవ, మహాభిశేకం, స్వామి వారికి ప్రత్యేకంగా నవనీత(వెన్నతో)ప్రత్యేక అలంకారం చేశారు అనంతరం కడప వాస్తవ్యులైన సుధా పండితులు  పం. మాళిగి విద్యానిధి ఆచార్యులచే పండిత ప్రవచనము అనంతరం సా.7:00 శ్రీ సీతారామలక్ష్మణ సమేత హనుమంతుని సహితంగా గజవాహనం పై పురవీధులగుండా ఊరేగింపు నిర్వహించారు, తరువాత స్వామి వారి ఉత్సవమూర్తులకు “ఊంజల్ సేవ” నిర్వహించారు, ఈ సందర్భంగా ప్రత్యేకంగా స్వామి వారి భక్తి సంగీత కార్యక్రమం, తి.తి.దే‌వారిచే సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.అనంతరం ప్రముఖ కే.వి.సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలల అధినేత కె.వీ.సుబ్బారెడ్డి  సౌజన్యంతో అన్నప్రసాద, సుబ్రహ్మణ్యం తీపి మిఠాయి  వారి సహకారంతో స్వీట్ వితరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ,శ్రీనివాస్ మూర్తి ,రాఘవేంద్ర మూర్తి ,సత్యప్రియ, సుధీంద్ర, చిలుకూరి రాఘవ అఖిల్ శ్యామాచార్, చంద్రకాంత్ రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.

About Author