మిషన్ శక్తి పథకం వన్ స్టాప్ సెంటర్ పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: ఆపదలో ఉన్న మహిళలు, బాలికలకు తక్షణ సహాయం అందించడానికి వన్ స్టాప్ సెంటర్ అందుబాటులో ఉంటుందని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు.సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో మిషన్ శక్తి పథకం వన్ స్టాప్ సెంటర్ పోస్టర్ ను కలెక్టర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో వన్ స్టాప్ సెంటర్ – మిషన్ శక్తి ద్వారా గృహ హింస, అత్యాచారాలు, లైంగిక వేధింపులు, యాసిడ్ దాడులు, మహిళల అక్రమ రవాణా, బాలికలపై లైంగిక వేధింపులు, కిడ్నాప్‌లు, సైబర్ నేరాలు, బాల్య వివాహాలు వంటి సందర్భాల్లో బాధిత మహిళలకు చట్టపరమైన, వైద్య, మానసిక, సలహా మరియు పునరావాస సహాయం అందజేయబడుతుందన్నారు.కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.విజయ, డిఆర్ఓ సి. వెంకట నారాయణమ్మ, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ విజయ లక్ష్మి, వన్ స్టాప్ సెంటర్ అడ్మిన్ పి.మేరీ స్వర్ణలత, జోష్టనా తదితరులు పాల్గొన్నారు.

