NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అక్షరశాతం పెంపు దిశగా సమగ్ర చర్యలు

1 min read

మే 28 ప్రీ–ఫైనల్ పరీక్షకు వంద శాతం మహిళల హాజరు లక్ష్యం

ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ తప్పనిసరి

మార్చి 1న జిల్లా సర్వసభ్య సమావేశానికి అధికారులు సిద్ధంగా వుండాలి

నంద్యాల, న్యూస్​ నేడు: జిల్లాలో అక్షరశాతాన్ని గణనీయంగా పెంచేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్లో నిర్వహించిన ప్రజా పరిష్కార వేదిక అనంతరం అక్షరాంధ్ర కార్యక్రమం, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాటించాల్సిన ప్రోటోకాల్ నియమాలు, అలాగే రానున్న జిల్లా సర్వసభ్య సమావేశంపై ఆమె సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా అక్షరాస్యతను విస్తృత స్థాయిలో పెంచేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు. జిల్లాలో మొత్తం 1,00,686 మంది మహిళలను విద్యావంతులుగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని నిర్దేశించామని తెలిపారు. ఇందులో డిఆర్డిఏ ద్వారా 50,000 మంది, డ్వామా ద్వారా 25,686 మంది, మెప్మా ద్వారా 25,000 మంది మహిళలను చేర్చేలా ప్రణాళిక రూపొందించామని వివరించారు. ప్రతి వాలంటీర్‌కు కనీసం 10 మంది మహిళలను అనుసంధానం చేసి వారికి అవసరమైన శిక్షణ అందించాలన్నారు. ముఖ్యంగా పొదుపు సంఘాల మహిళలకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి, మే 28న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్న ప్రీ–ఫైనల్ పరీక్ష (ఐదవ మోడల్ పేపర్)కు వంద శాతం హాజరు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ నెల 28న నిర్వహించనున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ రాము నాయక్, వయోజన విద్య సంక్షేమ శాఖ ఉపసంచాలకులు చంద్రశేఖర్, డిఎల్డిఓ శివారెడ్డి, మున్సిపల్ కమిషనర్ శేషన్న తదితరులు పాల్గొన్నారు.

About Author