ప్రతి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలి
1 min read

నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 22 అర్జీలు
కర్నూలు, న్యూస్ నేడు: సోమవారం ప్రతి అధికారి ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ ఆదేశించారు. సోమవారం స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో పీజిఆర్యస్ కార్యక్రమం నిర్వహించారు. వివిధ విభాగాలకు సంబంధించి 22 అర్జీలు రాగా, వాటిని చట్టపరిధిలో పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కమిషనర్ అర్జీదారులకు హామీనిచ్చారు.కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్జివి కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, మేనేజర్ చిన్నరాముడు, ఎస్ఈ రమణమూర్తి, కార్యదర్శి నాగరాజు, ఎంఈ మనోహర్ రెడ్డి, ప్రజారోగ్య అధికారి డాక్టర్ నాగశివ ప్రసాద్, టిడ్కో అధికారి పెంచలయ్య, పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్ బాష, తదితరులు పాల్గొన్నారు.

