NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆది కర్మయోగి అభియాన్ రెండవ దశ గ్రామ సభల నిర్వహణ

1 min read

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో గిరిజనుల అభివృద్దె ధ్యేయంగా పాలన

జిల్లా కలెక్టర్ కె.వెట్రి సెల్వి ఆదేశాలతో గిరిజన ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమాలు

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు  : ఆది కర్మయోగి అభియాన్ కార్యక్రమంలో రెండవ దశ గ్రామ సభల నిర్వహణ కార్యక్రమం జిల్లాలో చురుకుగా సాగుతుంది. గిరిజన గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  ఆది కర్మయోగి అభియాన్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి.ఆది కర్మయోగి అభియాన్ లో  గిరిజనులు, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలు కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కు అధికారులు సమర్పించాల్సి ఉంది.  జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశాల మేరకు గిరిజన సంక్షేమ శాఖ అధికారులు  ఆది కర్మయోగి అభియాన్  కార్యక్రమం ద్వారా    గిరిజనులు అవసరాలు,గిరిజన ప్రాంతాల అభివృద్ధికి అవసరమైన రహదారులు, త్రాగునీరు, వ్యక్తిగత మరుగుదొడ్లు, విద్యుత్, వంటి మౌలిక సదుపాయాలతో పాటు  గృహాలు, పరిశ్రమల స్థాపన, యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, వ్యవసాయం, అనుబంధ రంగాలకు చేయూత వంటి అభివృద్ధి కార్యక్రమాలు, సామజిక పెన్షన్లు, తదితర సంక్షేమ కార్యక్రమాలు, శాంతి, భద్రతలు వంటి అనేక అంశాలకు సంబంధించి ప్రతీ గ్రామానికి అవసరమైన అంశాలతో గ్రామాల వారీగా విజన్ యాక్షన్ ప్లాన్  మొదటి దశలో  జిల్లాలోని 9  మండలాల్లోని 46 గ్రామాల విజన్ యాక్షన్ ప్లాన్ లను రూపొందించి కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపించారు. గ్రామ సభలో ఇంచార్జ్ ఎంపిడిఓ సిహెచ్. గోపాలకృష్ణ, , మాస్టర్ ట్రైనర్లు కె.వి. వి.ఎస్. ప్రసాద్, ఎన్ . పున్నరి, పంచాయతీ కార్యదర్శి ఎస్.కె. రాధికా,  గ్రామ సర్పంచ్ రత్నకుమారి,  ఉప సర్పంచ్ ఏ . రాకేష్, , సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి ప్రతిపాదనలు చేసి, గ్రామ సభలో పాల్గొన్న గిరిజనులు   అది కర్మయోగి అభియాన్ సెల్ఫీ వద్ద ఫోటోలు తీసుకున్నారు.

About Author