జిల్లా పోలీస్ స్టేషన్ రిసెప్షనిస్ట్ లకు వన్ డే వర్క్ షాప్ అవగాహన కార్యక్రమం
1 min read

ఫిర్యాదుదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం గా భావించాలి
జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్
పోలీస్ శాఖ యొక్క గౌరవాన్ని ప్రతిబింబించేలా నడుచుకోవాలి
ఏలూరుజిల్లా ప్రతినిధి, న్యూస్ నేడు: ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ జిల్లా లోని అన్ని పోలీస్ స్టేషన్ల రిసెప్షనిస్ట్‌ల కోసం ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం లోని సమావేశ మందిరం లో ఒక రోజు అవగాహన కార్యక్రమం నిర్వహించినారు.ఈ కార్యక్రమము లో జిల్లా ఎస్పీ మాట్లాడుతూవర్క్ షాప్ ప్రధాన లక్ష్యాలుపోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదిదారులకు మెరుగైన సేవలందించడం, పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెంచడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు.ఎస్పీ ముఖ్య సూచనలు మరియు ఆదేశాలు వివరిస్తూ.రిసెప్షనిస్ట్‌ల విధి నిర్వహణ,ప్రజా సంబంధాలపై లోతైన మార్గదర్శకాలను అందించా లన్నారు.మర్యాద పూర్వక ప్రవర్తనతోపోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదిదారుడిని మర్యాదపూర్వకంగా పలకరించాలి.వారిని కూర్చోబెట్టి, మంచి నీరు అందించడం ద్వారా సౌకర్యాన్ని కల్పించాలన్నారు.పోలీస్ స్టేషన్ల వద్ద ప్రజలకు మొదట కనిపించే ముఖాలు రిసెప్షనిస్ట్ లే కాబట్టి,వారు పోలీస్ శాఖ యొక్క గౌరవాన్ని ప్రతిబింబించేలా నడుచుకోవాలి. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్య చంద్రరావు, కైకలూరు రూరల్ ఇన్స్పెక్టర్ వి.రవికుమార్, డి.సి.ఆర్.బి ఇన్స్పెక్టర్ హబీబ్ భాషా,మహిళా పోలీస్ స్టేషన్ మహిళా ఎస్ఐ నాగమణి,జిల్లా లోని అన్ని పోలీస్ స్టేషన్ ల యొక్క రిసెప్షన్లో పనిచేసే మహిళా,పురుష పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


