NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రెండవ రోజుకు చేరిన సహకార సంఘం ఉద్యోగుల దీక్షలు

1 min read

పత్తికొండ , న్యూస్​ నేడు:  న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం నిరసన దీక్షలు చేపట్టిన సహకార సంఘం ఉద్యోగుల దీక్షలు మంగళవారం నాటికి రెండవ రోజుకు చేరుకున్నాయి. ముందుగా నిరసన దీక్షల్లో కూర్చున్న ఉద్యోగులకు సిపిఎం మండల కార్యదర్శి చక్రాల వెంకటేశ్వర్ రెడ్డి, సిఐటియు మండల కార్యదర్శి రవిచంద్ర  పూలమాలవేసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన జీవో నెంబర్ 36 ను వెంటనే అమలు చేయాలని, రిటైర్మెంట్ వయోపరిమితి 62 సంవత్సరాలకు పెంచాలని, జీతభత్యాలు డ్యూటీ పద్దులు రద్దు చేయాలని, 2019 తర్వాత సహకార సంఘంలో చేరిన ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజేషన్ చేయాలని, సీనియార్టీ ప్రాతిపదికన జిల్లాలో ఖాళీగా ఉన్న సీఈవో పదవులను వీరితో భర్తీ చేయాలని, ఐదు లక్షల వరకు సహకార సంఘం ఉద్యోగులకు ఆరోగ్య భీమా కల్పించాలని, గ్రాచుటీ బెనిఫిట్స్ వీరికి వర్తించేలా చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ కు వినతిపత్రం అందించారు. ఈ రిలే దీక్షలకు సిపిఐ నాయకులు నబి రసూల్ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో రహంతుల్లా, గిడ్డయ్య, ఏసు ప్రవక్త, మల్లికార్జున, చాంద్ బాషా, శివ గౌడ్, రమణ, ఎర్రి స్వామి, నాయుడు, తదితర సహకార సంఘ ఉద్యోగులు పాల్గొన్నారు.

About Author