న్యాయస్థానాన్ని అవమానించిన ఎస్సై లపై చర్యలు తీసుకోవాలి..
1 min read

ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్ రామిరెడ్డి
పత్తికొండ , న్యూస్ నేడు: న్యాయస్థానాన్ని అవమానించిన ఎస్ఐలపై రాష్ట్ర ప్రభుత్వం, డిజిపి చర్యలు తీసుకోకపోతే న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యమాలను ఉదృతం చేస్తామని ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్ రామిరెడ్డి, విజయవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏకే భాష, కర్నూలు సీనియర్ అడ్వకేట్స్ నాగలక్ష్మి దేవి, ఓంకార్ లు హెచ్చరించారు. న్యాయస్థానాన్ని అవమానించిన ఎస్ఐలపై చర్యలు తీసుకోవాలని మంగళవారం పత్తికొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మధుబాబు ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి స్థానిక జూనియర్ సివిల్ కోర్టు నుండి పాత బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్ మీదుగా గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్, గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాల వేశారు. పత్తికొండ న్యాయవాదులు చేస్తున్న ర్యాలీకి ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్ రామిరెడ్డి, విజయవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏకే భాష, కర్నూల్ సీనియర్ న్యాయవాదులు నాగలక్ష్మి దేవి ఓంకార్, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్ బార్ అసోసియేషన్ ల అధ్యక్షులు శ్రీరాములు, రసీదుల్లా, ఎల్ కృష్ణ ప్రసాద్, ఆలూరు బార అసోసియేషన్ సెక్రటరీ సాకీర్ లు మద్దతు తెలిపి మాట్లాడారు. కోర్టులో లొంగిపోయేందుకు వచ్చిన ముద్దాయి శివన్నను చిప్పగిరి ఎస్సై సతీష్ కుమార్, పత్తికొండ ఎస్సై విజయ్ కుమార్ లు కాలర్ పట్టుకుని లాకెళ్లడం అన్యాయం అన్నారు. కోర్టులో లొంగిపోయేందుకు వచ్చిన ముద్దాయి శివన్నను ఇలా లాక్కేళ్లడం అన్యాయమని అడ్డు చెప్పేందుకు వచ్చిన రవికుమార్ అనే అడ్వకేటుపై దురుసుగా ప్రవర్తించడం హేయమైన చర్య అన్నారు. ఈ విషయంపై పత్తికొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదూలందరు రోడ్డెక్కి నిరసనలు, ర్యాలీలు నిర్వహించారు.

