NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా ముగిసిన డివిజనల్ స్థాయి అథ్లెటిక్స్ పోటీలు 

1 min read

పత్తికొండ , న్యూస్​ నేడు: పత్తికొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ప్రతిష్టాత్మకంగా జరిగిన పత్తికొండ డివిజన్ స్థాయి అథ్లెటిక్స్ పోటీలు గురువారం నాటికి ముగిశాయి. ఈ అథ్లెటిక్స్ పోటీలలో 400 మంది క్రీడాకారులు  పాల్గొన్నారు. డివిజన్ స్థాయిలో విజయం సాధించిన క్రీడాకారులు జిల్లా స్థాయిలో పాల్గొంటారని అథ్లెటిక్స్ పత్తికొండ కోఆర్డినేటర్ చందు నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పత్తికొండ విద్యాధికారి పత్తికొండ మండల విద్యాధికారి రాజా రామ్మోహన్, ఏపీపీఈటీస్& ఎస్​ఏ పిఈ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు జోసెఫ్ లక్ష్మయ్య, పత్తికొండ డివిజన్ కోఆర్డినేటర్, కొత్తగా వచ్చిన 40మంది వ్యాయమ ఉపాధ్యాయులలకు ఏపీ పీఈటి స్​    మరియు ఎస్​ఏ పిఈ అసోసియేషన్ పత్తికొండ వారు ఘనంగా సన్మానిచడం జరిగింది అని పీఈటి స్​    మరియు పీడిఎస్​ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి చందు నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమం లో వ్యాయమ ఉపాధ్యాయులు సంజప్ప, పాండు, రంగా,వేణు, మధు,రంగా,మధు ఆనంద్,అంజి,విష్ణు,రాఘవేంద్ర, రంగస్వామి, రాము రుక్మిణి, హనుమంతమ్మ, రజియా నరసన్న, సునీల్, హరి రాజశేఖర్ నాయక్ పాల్గొన్నారు.

About Author