NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గుంతలు పడ్డ రోడ్డులో మొక్కలు నాటి నిరసన తెలిపిన సిపిఎం 

1 min read

పది సంవత్సరాలైనా పత్తికొండకు నూతన రోడ్డుకు మోక్షం ఎప్పుడు

ఎమ్మెల్యేలు మారినా గుంతలు పడ్డ రోడ్లు మాత్రం మారవు సిపిఎం మండల కార్యదర్శి చక్రాల వెంకటేశ్వర్ రెడ్డి,

పత్తికొండ రోడ్లకు ఎంతకాలం ఈ దుస్థితి. సిఐటియు మండల కార్యదర్శి  రవిచంద్ర,

పత్తికొండ, న్యూస్​ నేడు:  పత్తికొండ పట్టణంలో గుంతలపడ్డ రోడ్డు లో సిపిఎం పార్టీ నాయకులు మంగళవారం మొక్కలు నాటి నిరసన కార్యక్రమం నిర్వహించారు.  సిఐటియు మండల కార్యదర్శి యం. రవిచంద్ర అధ్యక్షతన నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చక్రాల వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. పత్తికొండ పట్టణానికి సంబంధించిన తారు రోడ్డు దాదాపుగా పది సంవత్సరాల నుండి నూతనంగా నిర్మితం కాలేదని ఎప్పుడో వేసిన రోడ్డు నే మరమ్మత్తులు చేస్తూ కాలం నెట్టుకొస్తున్నారని విమర్శించారు. నిరంతరం వాహనాలతో రద్దీగా ఉండే కాలం కాలం చెల్లిన రహదారి వర్షాలకు గుంతల మయమైందన్నారు. ఈ విషయమై సిపిఎం, సిఐటియు ఆధ్వర్యంలో అనేకమార్లు ధర్నాలు చేపట్టగా, తూతూ మంత్రంగా మట్టితోలి మరమ్మత్తులు చేయడం తప్ప పటష్టంగా రోడ్లు వేయడం లేదని అన్నారు. ఇప్పటికైనా పట్టణంలో గుంతలు పడిన రోడ్లను తిరిగి పునర్ నిర్మించాలని ఆయన కోరారు పెద్ద ఎత్తున పట్టణ ప్రజలతో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం గుంతలు బడి నీళ్లు ఆగిన తారు రోడ్డులో మొక్కలు నాటి నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు సిద్దయ్య గౌడ్, డివైఎఫ్ఐ నాయకులు అల్లిపీరా, ప్రజానాట్యమండలి నాయకులు పెద్ద కాసిం, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు వర్కర్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author