NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వెండి రథాన్ని ప్రారంభించిన రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  నగరంలోని పూల బజారులో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో భక్తుల సహకారంతో రూపొందించిన వెండి రథాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం వెండి రథానికి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వెండి రథం ఆలయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే దేవి శరన్నవరాత్రి వేడుకలను పురస్కరించుకొని సరస్వతి దేవి అవతారంలో అలంకరణలో ఉన్న అమ్మవారిని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు వాయుగండ్ల సుబ్బారావు, చిలుకూరు నందకిషోర్,మారం శ్రీనివాసులు, కొండ నాగరాజు,  ద్వారకానాథ్,  సాయిబాబా, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ భక్తుల సహకారంతో అమ్మవారికి వెండి రతాన్ని తయారు చేయించినట్లు తెలిపారు. ఈ రతాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషంగా ఉందని చెప్పారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలు శాంతి సౌభాగ్యాలతో జీవించాలని వారు ఆకాంక్షించారు. అలాగే దేవి శరన్నవరాత్రి వేడుకలను ఆలయంలో ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ వేడుకల సందర్భంగా అమ్మవారు ప్రతి రోజు ఒక అలంకరణతో భక్తులకు దర్శనమిస్తున్నారని తెలియజేశారు.

About Author