పలు అంశాలపై జిల్లాల కలెక్టర్లతో సిఎస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష
1 min read

జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలను సిఎస్ కు కలెక్టర్ కె.వెట్రీసెల్వి వివరించారు
ప్రభుత్వ శాఖలు ప్రజలకు అందిస్తున్న సేవలపై ప్రజాప్రయాన్ని తెలుసుకునేందుకు దేవాలయాల వద్ద
క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయాలి
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: వాట్సాప్ గవర్నెన్స్ పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తున్నామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ కు తెలియజేసారు. ఏపీ సచివాలయంలోని సిఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి గురువారం ఎంఎస్ ఎం ఈ పార్కుల ఏర్పాటు,ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సేవలు, రెవిన్యూ, సర్వే, రవాణా శాఖ, తదితర శాఖల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సేవలలో ప్రజల సంతృప్తి స్థాయి, మల్టీ స్పెషలిటీ ఆసుపత్రుల నిర్మాణం,తదితర అంశాలపై జిల్లాల కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలను కలెక్టర్ వెట్రిసెల్వి సీఎస్ కి వివరించారు. ఈ సందర్భంగా సీఎస్ విజయానంద్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ శాఖలు ప్రజలకు అందించే సేవలపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేందుకు సంబంధిత శాఖల కార్యాలయాలు, దేవాలయాల వద్ద క్యూ ఆర్ కోడ్ ఏర్పాటు చేయాలన్నారు. మన మిత్ర యాప్ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలు ప్రభుత్వం నుండి పౌర సేవలు పొందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని, వాట్సాప్ గవర్నెన్స్ పై ప్రజలకు విస్తృతంగా అవగాహన కలిగించి ప్రజలు సులభమైన రీతిలో ధ్రువీకరణ పత్రాలు, లైసెన్స్ లు పొందడం, వంటి సేవలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో అన్ని ప్రాంతాలలో ముఖ్యంగా గిరిజన ప్రాంతాలలో ని ప్రజలకు వాట్సాప్ గవర్నెన్స్ పై విస్తృత అవగాహన కలిగిస్తున్నామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సేవలలో ప్రజల సంతృప్తి స్థాయిని పెంచేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు,జిల్లా పరిశ్రమల అధికారి వెంకటరావు, డిఎంహెచ్ఓ డా. అమృతం, డిసిహెచ్ ఎస్ డా. పాల్ సతీష్, ఆర్టీఓ శేఖర్,ప్రభృతులు పాల్గొన్నారు.

