NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆచార వ్యవహారాలను పరిరక్షించుకోవాలి

1 min read

డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తి.తి.దే.

ఘనంగా ముగిసిన తితిదే ధార్మిక కార్యక్రమాలు

కర్నూలు, న్యూస్​ నేడు: భారతీయ ఆచార వ్యవహారాలు ఎంతో గొప్పవని,  మన సంస్కృతి సంప్రదాయాల వల్లనే ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుందని, వాటిని పరిరక్షించుకోవలసిన బాధ్యత భారతీయులమైన మన అందరిపై ఉన్నదని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచారపరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లాశాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచారపరిషత్ ఆధ్వర్యంలో  నందికొట్కూరు పట్టణం, కోటవీధిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం నందు మంగళవారం ప్రారంభమైన ధార్మిక కార్యక్రమాలు శనివారం అత్యంత భక్తిశ్రద్దలతో ముగించారు. మూడు రోజులపాటు తెలుగు పండితులు, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కవిరాజ, డాక్టర్ చిన్నావుల వేంకట రాజారెడ్డి శ్రీమద్రామాయణం, మహాభారతం, వేంకటేశ్వర మహత్య్మం భక్తులను మంత్రముగ్దులను చేశాయి. ముగింపు సందర్బంగా గోపూజ మరియు కుంకుమార్చనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు నాగభూషణ శర్మ, అర్చకులు సురేశ్, స్కాలర్స్ పాఠశాల కరెస్పాండంట్  కాళ్ళురి లక్ష్మి,   ధార్మిక సంస్థల ప్రతినిధులు అల్వాల బాలయ్య, హేమలత,  జి.భాస్కర రెడ్డి,  శ్రీసాయి విద్యాసంస్థల అధినేత పల్లా సుధాకర్ రెడ్డి, బి. రమణ రెడ్డి, శెట్టి రవీంద్ర ప్రసాద్, బి.సురేశ్,  కాంతారెడ్డి, మోహన్ రెడ్డి, ధర్మ ప్రచార మండలి సభ్యులు అంబటి శివశంకర రెడ్డి,  ఓంకార్,  పుల్లారెడ్డి, రమణయ్య, రామిరెడ్డి, రాముతో పాటు ఆదిత్య హృదయం పారాయణ సంఘం సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

About Author