సచివాలయ సిబ్బందిపై డిడివో ఆగ్రహం
1 min read

ఇంటి,కుళాయి పన్నులు త్వరగా పూర్తి చేయాలి
పల్లెవెలుగు మిడుతూరు (నందికొట్కూరు): మిడుతూరు సచివాలయ సిబ్బందిపై ఆత్మకూరు డివిజనల్ అభివృద్ధి అధికారి అన్వరా బేగం ఆగ్రహం వ్యక్తం చేశారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలో ఉన్న సచివాలయాన్ని శుక్రవారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు.డిడిఓ కార్యాలయంలో కూర్చున్నా డిడివోను ఎంతసేపటికీ అక్కడున్న సచివాలయ సిబ్బంది గౌరవించలేదు ఆమెతో మాట్లాడక పోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.పై అధికారి అయిన నన్నే గౌరవించకపోతే మీరు ప్రజలను ఏ విధంగా గౌరవిస్తారని సచివాలయ సిబ్బందిపై ఆమె మండిపడ్డారు.ఎంపీడీవో దశరథ రామయ్య, డిప్యూటీ ఎంపీడీవో సంజన్న వచ్చారు.తర్వాత రికార్డులను ఆమె తనిఖీ చేశారు.మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు మరియు డిజిటల్ అసిస్టెంట్లతో జరిగిన సమావేశంలో ఇంటి,కుళాయి పన్నులు వసూలు చేయడంలో వెనుకబడి ఉన్నామని వీటిని పూర్తి చేయుటకు చొరవ తీసుకోవాలని ఆమె ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో సురేష్ కుమార్,పంచాయతీ కార్యదర్శులు చాందిని,కేశావతి, వెంకటేష్,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

