NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా మామిడి పండ్ల మార్కెట్ ప్రారంభోత్సవం

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి మండలంలోని పొద్దోడి గ్రామంలో ఏర్పాటు చేసిన మామిడి పండ్ల మార్కెట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. గ్రామానికి చెందిన పుల్లారెడ్డి రైతు ఆహ్వానం మేరకు  కార్యక్రమంలో డోన్ నియోజకవర్గ శాసనసభ్యులు కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి  ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మామిడి రైతులకు మార్కెట్ సదుపాయాల ప్రాముఖ్యతను వివరించి, నేరుగా విక్రయ అవకాశాలు పెరగడం ద్వారా రైతులకు న్యాయమైన ధరలు లభిస్తాయని తెలిపారు. ఈ మార్కెట్ ద్వారా స్థానిక రైతుల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని, వ్యవసాయోత్పత్తులకు గిరాకీ పెరుగుతుందని అన్నారు. ఈకార్యక్రమంలో తేదేపా సీనియర్ నాయుకులు లక్కసాగరం లక్ష్మి రెడ్డి,ఎద్దుల దొడ్డి ప్రభాకర్ రెడ్డి,సీమా సుధాకర్ రెడ్డి, లక్ష్మి నారాయణ యాదవ్, ఏనుగమర్రి రామకృష్ణ,మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజా రేణుక, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజా నారాయణమూర్తి, మాజీ ఎంపీపీ శ్రీనివాసులు, ఎంపిడిఓ శ్రీనివాసరావు,బత్తుల రామేష్ రెడ్డి, నాగేంద్ర,గోల్ల రామ్మోహన్ యాదవ్, నారాయణ ,కదిరప్ప, సర్పంచ్,ముస్లిం మైనార్టీ నాయకులు ఖాజా ఫీర్,తేదేపా మండల కన్వీనర్ సుదర్శన్,పట్టణ అధ్యక్షుడు కోంగన పల్లే మదు,ప్రిన్స్ పాల్ మదు,నల్లమెకలపల్లె సత్యం  , రాజశేఖర్, పెద్ద పూజర్ల ప్రసాద్ రెడ్డి, సుధాకర్ గుప్తా, అదే బాద్ పరమేష్, ఎంఆర్ఓ భరతి, డిప్యూటీ ఎంపీడీవో ప్రభాకర్, రామిరెడ్డి,జిల్లా హార్టికల్చర్ అధికారి నాగరాజు,హార్టికల్చర్ అధికారి కళ్యాణి, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author