పాలేరు వాగును పరిశీలించిన మండల తహసిల్దార్
1 min read
మహానంది, న్యూస్ నేడు: మహానంది మండల తహసిల్దార్ రమాదేవి శనివారం పాలేరు ఉధృతిని పరిశీలించారు. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత నల్లమల అడవి ప్రాంతంలో అధిక వర్షం కురవడంతో పాలేరు వాగు పొంగి ప్రవహిస్తుంది. దీంతో మహానంది, బోయలకుంట్ల మెట్ట రహదారిలో వాహనదారులకు అంతరాయం ఏర్పడింది. వాగు ఉధృతి దృష్ట్యా వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని నీటి ప్రవాహం అధికంగా ఉన్నందున పాలేరు వాగు దాటి ప్రయత్నం చేసి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని తాహసిల్దార్ రమాదేవి హెచ్చరించారు. పాలేరు వాగు ఉధృతి వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా పాలేరు వాగు చుట్టుపక్కల గ్రామాల విఆర్ఓ లను అప్రమత్తం చేశామని తాహసిల్దార్ రమాదేవి తెలిపారు.

