NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దేవనకొండ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి…సిపిఎం 

1 min read

న్యూస్ నేడు, పత్తికొండ:  గత ఖరీఫ్ సీజన్లో  అధిక వర్షాలు నేపథ్యంలో భారీగా నష్టపోయిన దేవనకొండ మండల  రైతాంగాన్ని ఆదుకునేందుకు మండలాన్ని కరువు మండలం గా ప్రకటించాలని సిపిఎం జిల్లా నాయకులు బి వీర శేఖర్ డిమాండ్ చేశారు. మంగళవారం నాడు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిప్యూటీ తాసిల్దార్ కు దేవనకొండ మండలంను కరువు మండలం గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కమిటీ సభ్యులు యూసుఫ్ భాష అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వీరశేఖర్ మాట్లాడుతూ, గత వ్యవసాయ సీజన్ లో ముఖ్యంగా ఖరీఫ్ సీజన్ నందు ఆగస్టు మాసం నుండి అక్టోబర్ నెల వరకు అతివృష్టి నేపథ్యంలో ఖరీఫ్ సీజన్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆయన పేర్కొన్నారు ఎకరాకు 8 నుండి 10 కింటాలు రావలసిన పత్తి  మూడు నాలుగు క్వింటాలకే పరిమితమైందని అదేవిధంగా ఇతర వాణిజ్య పంటలు, వేరుశనగ, కంది ,ఆముదము జొన్న, మొక్కజొన్న వంటి  పంటల దిగుబడి  భారీగా పడిపోయిందని పెట్టుబడులు మాత్రం వేలకు వేలు పెట్టి దిగుబడి లేక రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. కావున ప్రభుత్వం స్పందించి మండలాన్ని కరువు మండలం గా ప్రకటించి రైతుకు  పంట నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. హంద్రీనీవా కాలువకు నుండి సాగునీరు వస్తున్న పంట కాలువలు లేని నేపథ్యంలో రైతులందరికీ సాగునీరు రావడంలేదని ఇది ప్రభుత్వం గమనించాలని ఆయన కోరారు. వాస్తవ పరిస్థితుల్లో గమనించి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మరియు ప్రజా సంఘాల నాయకులు కౌలుట్ల, మార్కండేయులు , జయ రాముడు, చిన్న కౌలుట్లయ్య, రామాంజనేయులు, రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.

About Author