మహానంది క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
1 min read

మహానంది, న్యూస్ నేడు: మహానంది క్షేత్రానికి కార్తీకమాస పర్వదిన సందర్భంగా చివరి సోమవారం భక్తులు పోటెత్తారు. క్షేత్రంలోని ప్రధాన కోనేరులలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని పునీతులయ్యారు. ముఖ్యంగా మహిళ భక్తులు క్షేత్రంలోని ముందు బాగాన మరియు కోనేరులు, పంచలింగాల ప్రాంతాల్లో ద్వీపాలను వెలిగించి తమ మొక్కులను తీర్చుకున్నారు. క్షేత్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకుగాను మహానంది ఎస్ఐ రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. స్పెషల్ పార్టీ మరియు మఫ్టీ పోలీసులు నిరంతరం నిఘా కొనసాగించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు చూసుకున్నామని ఆలయ కార్య నిర్వహణ అధికారి నల్లకాలువ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. భక్తులకు క్యూలైన్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ స్థానిక సిబ్బందికి సూచనలు చేస్తూ స్వామి అమ్మవార్ల దర్శన భాగ్యం భక్తులకు అందే విధంగా చర్యలు చేపట్టారు.

