NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కార్తీకపౌర్ణమి కి అధిక సంఖ్యలో శ్రీశైల క్షేత్రంలో భక్తులు

1 min read

శ్రీశైలం, న్యూస్​ నేడు:  కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఈ రోజు (05.11.2025) భక్తులు వేకువజాము నుండే  అధిక సంఖ్యలో ఆలయాన్ని సందర్శిస్తున్నారు. అలాగే వేకువజాము నుంచే భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలాచరించుకుని శ్రీస్వామిఅమ్మ వార్ల దర్శనార్థమై ఆలయానికి చేరుకుంటున్నారు. దర్శనం ఏర్పాట్లు కార్తీకమాసంలో ప్రభుత్వసెలవుదినాలు, కార్తీక సోమవారాలు మరియు కార్తీకపౌర్ణమి రోజులలో భక్తులు అధిక సంఖ్యలో క్షేత్రానికి చేరుకోవడం జరుగుతోంది. భక్తులందరు సంతృప్తికరంగా  శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు వీలుగా దర్శన ఏర్పాట్లు చేయడం జరిగింది. దర్శనం ఏర్పాట్లువేకువజామున 3గంటలకు ఆలయ ద్వారాలు తెరచి ప్రాత:కాలసేవలను జరిపించిన అనంతరం వేకువజామున గం. 4.30ల నుంచి సాయంత్రం గం. 4.00ల వరకు దర్శనాలను కొనసాగించడం జరుగుతోంద.అన్నప్రసాద వితరణ భక్తులకు అన్నదాన భవనములో ఉదయం 10.30 నుండి అన్నప్రసాదాల వితరణ చేయబడుతున్నాయి. అలాగే సాయంత్రం గం. 6.30ల నుంచి భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేయబడుతుంది.లడ్డు ప్రసాదాలు..      కార్తీకమాసంలో వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన సంఖ్యలో లడ్డు ప్రసాదాలు సిద్ధం చేయబడ్డాయి.  మొత్తం 10  కౌంటర్ల ద్వారా ప్రసాదాలు అందజేయబడుతున్నాయి.

About Author