ప్రవేట్ , ఆర్టీసి ట్రావెలింగ్ బస్సుల్లో ముమ్మర తనిఖీలు
1 min read
వాహనాల తనిఖీలు , భద్రతా ప్రమాణాల పర్యవేక్షణ.
భద్రతా ప్రమాణాలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం…
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు, న్యూస్ నేడు: ఇటీవల బస్సు ప్రమాద ఘటన నేపథ్యంలో ప్రైవేట్ , ఆర్టీసి ట్రావెలింగ్ బస్సులలో ముఖ్యంగా రాత్రి పూట తిరిగే బస్సులలో సరైన భద్రతా చర్యలు మరియు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ బుధవారం తెలిపారు. ఇటీవల జరిగిన బస్సు దుర్ఘటన నేపథ్యంలో జిల్లా ఎస్పీ గారు పోలీసు అధికారులను అప్రమత్తంగా ఉండాలని తనిఖీలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీలు చేస్తున్నారు.ప్రయాణికుల రక్షణ మరియు భద్రతా ప్రమాణాలను పరిశీలించి, అవి సక్రమంగా ఉన్నాయో లేదో నిర్ధారించడానికి విస్తృత తనిఖీలు చేపట్టారు.వాహనాలకు సంబంధించిన పత్రాలు, డ్రైవర్ల లైసెన్సులు, బస్సుల్లోని భద్రతా ప్రమాణాలను పరిశీలించారు.ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేసి భద్రతా ప్రమాణాలు పాటించాలని వారిని హెచ్చరించి పంపిస్తున్నారు. నిబంధనలకు విరుధ్ధంగా భధ్రతా ప్రమాణాలు పాటించని ప్రవేట్ ట్రావెల్స్ బస్సుల యాజామాన్యాల పై చర్యలు తీసుకోనున్నామని పోలీసు అధికారులు హెచ్చరించారు.వాహనాలను డ్రైవర్లు అతి వేగంతో నడపకుండా, నిద్ర మత్తులోకి జారకుండా పూర్తీగా తేరుకుంటే రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చనే జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో జిల్లాలో పోలీసులు ప్రధానంగా హైవేలపై ఈకార్యక్రమం నిర్వహిస్తున్నారు.

