NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న భక్తులు

1 min read

వివిధ సేవల రూపేణ రూ:1,52,908 /-లు ఆదాయం సమకూరినది

అసిస్టెంట్ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారిణి ఆర్.వి చందన

నిత్యాన్నదాన సత్రం నందు 1578 మందికి అన్నప్రసాధారణ వితరణ

 ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు:శనివారం సందర్భముగా ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం మండలము,గురవాయిగూడెం గ్రామము నందు తెల్ల మద్ది చెట్టు క్రింద స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి దేవస్థానము నందు ఉదయం గం.08.00ల నుండి ఆలయ ముఖ మండపం నందు పంచామృతఅభిషేకం ఆలయ అర్చకులు, వేద పండితులు, ఆద్వర్యములో జరుపబడినది. ఈ కార్యక్రమం నందు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనినారు. ఈ రోజు  సాయంత్రం గం.4.00 లవరకు శ్రీ స్వామి వారి ఆలయమునకు వివిధ సేవల రూపేణా రూ.1,52,908/-లు సమకూరినది. శ్రీ స్వామి వారికి స్వామి వారి నిత్యాన్నదాన సత్రం నందు సుమారు 1574 మంది భక్తులకు అన్నదానము జరుపబడినది. స్వామి వారి దర్శనమునకు విచ్చేసిన ఎటువంటి ఇబ్బంది కలగకుండా  తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయ అసిస్టెంట్ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారిణి ఆర్.వి.చందన తెల్పినారు.

About Author