ఘనంగా మాతృభాష దినోత్సవ వేడుకలు
1 min read

న్యూస్ నేడు, పత్తికొండ: పత్తికొండ స్థానిక పి .యం. శ్రీ .జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో హెచ్ఎం కాటం శ్రీదేవి ఆధ్వర్యంలో మాతృభాషా దినోత్సవం వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. మొదట తెలుగు తల్లి చిత్రపటానికి పూలమాల వేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కాటo శ్రీదేవి మాట్లాడుతూ, మనకు చిన్నప్పుడు తల్లి, తల్లిదండ్రులు నేర్పించిన భాషనే మాతృభాష అని, మనకు మాతృభాషను మనం అమ్మ ఒడిలో ఉన్నప్పుడు ,ఊయలలో జోల పాట పాడుతూ నిద్రపుచ్చేటప్పుడు,గోరుముద్దలు తినిపించేటప్పుడు మనకు అమ్మ నేర్పే భాష మాతృభాషని అన్నారు. ప్రతి వ్యక్తికి బాల్యములో తల్లి ఏ భాష నేర్పిస్తుందో అదే మాతృభాష అని ఆమె తెలిపారు. మన ఆంధ్రప్రదేశ్ లో మన మాతృభాష తెలుగు కాబట్టి తెలుగు గొప్పతనాన్ని గురించి ,తెలుగు భాష యొక్క తీయదనాన్ని గురించి, ప్రపంచంలో మన తెలుగు భాషకు ఉన్నటువంటి గొప్పతనాన్ని గురించి మనం తెలుసుకుని మన మాతృభాషని మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె విద్యార్థినిలకు తెలిపారు. ఈసందర్భంగా తెలుగు భాష ఉపాధ్యాయురాలు పద్మావతి మాట్లాడుతూ, ఫిబ్రవరి 21వ తేదీని ఎందుకు మాతృభాషా దినోత్సవంగా జరుపుకుంటాము ,దాని ప్రాముఖ్యతను ,చారిత్రక నేపథ్యాన్ని వివరించారు .1952లో మాతృభాష కోసం బలైనటువంటి బెంగాల్ విద్యార్థుల వీరమరణం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకోవాలని యునెస్కో 1999 లోనిర్ణయించింది. ఈ విధంగా ప్రపంచ వ్యాప్తంగా మాత ృభాష దినోత్సవాన్ని ఫిబ్రవరి 21వ తేదీన జరుపుకుంటున్నామని ఆమె తెలిపారు. అరసం జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 195 దేశాలలో దాదాపు 7147 మాతృభాషలు ఉన్నాయని మనదేశంలో దాదాపుగా 270 భాషలు ఉన్నాయని ఆయన అన్నారు.


