NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ ఆధ్వర్యంలో టీ–ఐసీఆర్‌పీ శిక్షణ ప్రారంభం

1 min read

— డిపిఎం శ్రీనివాసులు

నంద్యాల, న్యూస్​ నేడు:  జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ (NMSA) కార్యక్రమం కింద, ఆర్‌వైయస్‌యస్–ఏపిసిఎన్‌ఎఫ్ జిల్లా ప్రాజెక్టు నిర్వహణ విభాగం ఆధ్వర్యంలో టీ–ఐసీఆర్‌పీలకు (బ్యాచ్–02) ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం సోమవారం నంద్యాల జిల్లాలో ప్రారంభమైంది. ఈ శిక్షణలో నందికొట్కూరు, కోయిలకుంట్ల, డోన్ డివిజన్‌ల నుండి 63 మంది పాల్గొంటున్నారు. బ్యాచ్–02 శిక్షణ నవంబర్ 10 నుండి 14 వరకు కొనసాగనుంది. శిక్షణ కార్యక్రమం మొదటి రోజున ప్రాజెక్టు లక్ష్యాలు, ప్రకృతి వ్యవసాయంపై అవగాహన, మరియు టీ–ఐసీఆర్‌పీల బాధ్యతలపై సెషన్లు నిర్వహించారు.  కిచెన్ గార్డెన్లను ఏర్పాటు చేసి, రైతులకు సంఘాల ద్వారా ఆర్థిక వనరులు అందేటట్లు చర్యలు తీసుకోవాలి” అని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడిపిఎం, జిల్లా ఎన్‌ఎఫ్‌ఏలు సునంద, రామకృష్ణ, నరేంద్ర, కరీం భాష, డిటిటిలు, టీ–ఐసీఆర్‌పీలు పాల్గొన్నారు.

About Author