జిల్లా మహిళా సమాఖ్య కార్యవర్గ సమావేశం
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ , శిక్షణా కార్యాలయం బి. తాండ్రపాడు నందు జరుగుచున్న జిల్లా మహిళా సమాఖ్య కార్యవర్గ సమావేశము నందు డెమో శ్రీనివాసులు శెట్టిపాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ “స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం” లో భాగంగా మహిళలకు ఆరోగ్య సంరక్షణ కొరకు ప్రత్యేక వైద్య శిబిరాలను కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ నెల 17 వ తేదీ నుండి అక్టోబర్ 2 వ తేదీ వరకు ఆరోగ్యవంతమైన మహిళా – శక్తివంతమైన కుటుంబం అనే నినాదంతొ సమగ్ర ఆరోగ్య సేవా కార్యక్రమంలో భాగంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఎంసిపి కార్డులను సద్వినియోగం చేసుకవడం పై బాలింతలు, గర్భిణీలు అవగాహన కలిగిఉండాలని , ఎంసిపి కార్డు ద్వారా గర్భిణీ ప్రసవం వరకు తీసుకోవలసిన జాగ్రత్తలు, శిశువుకు సకాలంలో అందించాల్సిన టీకాలపై అవగాహన కలిగి ఉండి సకాలలో ఉపయోగించుకోవాలని తెలిపారు . అప్పుడే జన్మించిన శిశువు నుంచి ఐదేళ్లలోపు చిన్నారుల వరకు సాధరణంగా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది దీంతో ఆ చిన్నారులకు ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంటుంది, వీటిని అధిగమించాడానికి నిర్ణీత సమయానికి టీకాలు వేయించుకునేలా ఈ కార్డ్ ను రూపొందించినారని తెలిపారు . గర్భిణీ మరియు భాలింతలలో పోషకాహార ప్రాముఖ్యత గురించి వివరించారు . ముఖ్యంగా జిల్లా మహిళా సమాఖ్య సభ్యులు మండల / గ్రామ స్థాయిలో జరుగు సమావేశాలలో పై విషయాల గురించి చర్చించి మహిళలు ఉచిత వైద్య శిబిరాలలో ఆరోగ్య సేవలు వినియోగించుకొని ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమములో PD DRDA రమణా రెడ్డి , జిల్లా మహిళా సమాఖ్య అద్యక్షులు సీతాబాయి , DPM నరసమ్మ , DPI నవీన్ మరియు మండల మహిళా సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.

