ఆస్పత్రిని తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ..
1 min read

ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలి
నందికొట్కూరు, న్యూస్ నేడు: ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలని నంద్యాల జిల్లా వైద్యశాఖ అధికారి వెంకటరమణ సిబ్బందికి సూచించారు.బుధవారం నందికొట్కూరు పట్టణంలోని అర్బన్ హెల్త్ సెంటర్‌పై డిఎంహెచ్ఓ ఆర్ వెంకటరమణ,అదనపు డిఎంహెచ్ఓ శారదా బాయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య శాఖ అధికారులు సెంటర్లోని వైద్య రికార్డులు, రిజిస్టర్లు,ప్రజలకు ఇచ్చే మందుల నిల్వలను క్షుణ్ణంగా పరిశీలించారు.సెంటర్లో రోజువారీగా వచ్చే రోగుల సంఖ్య వారికి అందించే చికిత్స సేవలు,అత్యవసర మందుల నిల్వల వివరాలు అడిగారు.ఈ సందర్భంగా వారు డాక్టర్స్ మరియు సిబ్బందితో మాట్లాడి ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి, సమయానికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.మందుల పంపిణీ వ్యవస్థలో పారదర్శకత పాటించాలని, అవసరమైన మందులు ఎప్పటికప్పుడు ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. ఆరోగ్య సెంటర్ శుభ్రత,గదుల నిర్వహణ,వ్యర్థాల నిర్వహణ, రోగుల కోసం వేచి ఉండే ప్రాంతాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు. అంతేకాకుండా అర్బన్ సెంటర్లోని ప్రతి గదిని పరిశీలించి సిబ్బంది పనితీరును తెలుసుకున్నారు. సెంటర్ నిర్వహణ మరింత మెరుగుపరచాల్సిన అంశాలపై డాక్టర్ దివ్యమణి సూచనలు ఇచ్చి ప్రజలకు సమర్థవంతమైన వైద్య సేవలు చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అర్బన్ హెల్త్ సెంటర్ సూపర్వైజర్ సుబ్బరాజు మరియు సిబ్బంది పాల్గొన్నారు.


