మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తూ మరణించిన వారి కుటుంబానికి ఉద్యోగం కల్పించాలి
1 min read

ఎమ్మిగనూరు న్యూస్ నేడు : ఎమ్మిగనూరు పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తూ మరణించిన కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించడంలో మున్సిపల్ కమిషనర్ దొంద వైఖరి అవలంబిస్తున్నాడని, ఏఐటీయూసీ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో బుధవారం మూడోరోజు మున్సిపల్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలను ఏఐటియుసి పట్టణ కార్యదర్శి విజేంద్ర ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు 5 సంవత్సరాలనుండి మునిసిపాలిటీలో చనిపోయిన కుటుంబ సభ్యులను విధుల్లోకి తీసుకోవాలని అనేక దఫాలుగా పోరాటాలు కొనసాగించడం జరుగుతుందని, కమిషనర్ మాత్రం తన అపద్దాల మాటలతో అదిగో ఉద్యోగం, ఇదిగో ఉద్యోగం అంటూ చనిపోయిన కార్మికల కుటుంబ సభ్యులకు తన అరి చేతిలో వైకుంఠం చూపిస్తున్నాడని వారు తెలిపారు. 2021లో మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు విధుల్లోకి తీసుకోవాలని కౌన్సిల్ ఆమోదించిన నేటికీ తీసుకోకపోవడం చాలా బాధాకరమని వారు తెలిపారు.
మరోపక్క హిందూపురం, కదిరి, డోన్, కర్నూల్, ప్రస్తుతం ఎమ్మిగనూరు మున్సిపల్ కమిషనర్ గా ఉన్న గంగిరెడ్డి, గతంలో గుత్తిలో కమిషనర్ గా పనిచేస్తున్న సమయంలో చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులను విధుల్లోకి తీసుకోవడం జరిగిందని వారు తెలిపారు.అధికార పార్టీ,ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యులను మరియు మున్సిపల్ చైర్మన్ అనేక దఫాలుగా విన్నవించిన వారి పట్ల కనీసం కనికరం చూపడం లేదని వారు ఆవేదన వ్యక్తం. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు ఎల్లప్ప, శివకృష్ణ, ప్రతాప్, భీమ గౌడ్, యోహాన్, సల్మాన్, లక్ష్మన్న, వీరేష్, అల్లా బకాష్,శివ,పాల్గొన్నారు.
దీక్షలో కూర్చున్న చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులు
ఈ దీక్షలో కూర్చున్నవారు ఆశాజ్యోతి, ఆగారమ్మ, సుమాంజలి, రియాజ్, మధు, రాజు, నబి నసీమా, హుస్సేన్ బి, ఖాదర్ బి, మారెమ్మ, రూతమ్మ,లక్ష్మి, రాజారాం, ప్రవీణ్, తదితరులు దీక్షలో పాల్గొన్నారు.

