NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వేసవికాలంలో  ఈత రాని పిల్లలను చెరువులు, నదుల వద్దకు వెళ్లనీయవద్దు

1 min read

పిల్లల పట్ల తల్లిదండ్రులు  అప్రమత్తంగా ఉండాలి.

కర్నూల్  ఎస్పీ  విక్రాంత్ పాటిల్.

కర్నూలు, న్యూస్​ నేడు: వేసవికాలపు సెలవులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో చిన్నపిల్లలు ఈత కోసం కాల్వలు, కుంటలు, చెరువులు, నదుల వద్దకు వెళ్లి ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్  గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.ప్రత్యేకంగా గ్రామాలు,  పల్లెల్లో మరియు పట్టణ శివారు ప్రాంతాల్లో ఉన్న కాల్వలు, కల్వర్టులు, చెరువులు మరియు నదులలో అకస్మాత్తుగా జారిపడే ప్రమాదం ఉండటం వల్ల చిన్నపిల్లలు ప్రాణాపాయ పరిస్థితుల్లో పడుతున్న ఘటనలు ప్రతి సంవత్సరంచోటుచేసుకుంటున్నాయన్నారు.కర్నూలు ఎస్పీ  పిల్లల తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు. చిన్నపిల్లలను ఒంటరిగా బయటకు వెళ్లనీయవద్దు. కాల్వలు, కుంటలు, చెరువులు, నదుల దగ్గరకు వెళ్లకుండా తల్లిదండ్రులు పర్యవేక్షించాలి.  ఈత రాని పిల్లలు నీటి కుంటల దగ్గరికి వెళ్లకుండా ఖచ్చితంగా నియంత్రించాలి. పిల్లలకు నీటి ప్రమాదాల గురించి ఆయా గ్రామాల పెద్దలు, పాఠశాలల్లో  విద్యార్థులకు అవగాహన కల్పించాలి.లోతైన ప్రాంతాలను గుర్తించి పిల్లలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే స్థానిక పోలీసులకు గాని, డయల్ 112 కు గాని లేదా డయల్ 100 కు గాని సమాచారం ఇవ్వాలి.వేసవికాలంలో తల్లిదండ్రులు  పిల్లల పట్ల  జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్  విజ్ఞప్తి చేశారు.

About Author