NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తల్లిపాల ఔన్నత్యాన్ని తెలియజేస్తూ వైద్యుల సందేశం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  ప్రతి సంవత్సరం ఆగస్ట్ మొదటి వారం ప్రపంచ బ్రెస్ట్‌ఫీడింగ్ వారంగా జరుపుకుంటారు. ఇందులో 1 నుంచి 7 వరకు నిర్వహించే ప్రపంచ బ్రెస్ట్‌ఫీడింగ్ వారం సందర్భంగా, మెడికవర్ హాస్పిటల్స్ స్త్రీలలో తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కలిగిస్తోంది. తల్లిపాలు పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యానికి మూలస్తంభం అని వైద్యులు చెబుతున్నారు.తల్లిపాలలో ఉండే పోషకాలు, రోగనిరోధక శక్తి బిడ్డకు ఆరోగ్యవంతమైన జీవితం అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. తల్లి పాలతో పెరిగే శిశువులకు జీర్ణ సమస్యలు తక్కువగా ఉండే అవకాశముంది. దీర్ఘకాలికంగా చూస్తే, డయాబెటిస్‌, ఊబకాయం, శ్వాస సంబంధిత సమస్యలు వంటి వ్యాధుల నుంచి బిడ్డను రక్షించగలదు.డా. ఆర్ మురార్జీ, డా. కె సింధూర రెడ్డి , కన్సల్టెంట్ పీడియాట్రిక్స్ & నియోనాటాలజిస్ట్ మరియు డా. శిల్పా చౌదరి పెద్దపొల్ల డా. జ్యోత్స్న టి,కన్సల్టెంట్ ప్రసూతి వైద్యుడు & గైనకాలజిస్ట్ పాలుగోన్నారు. మెడికవర్ హాస్పిటల్స్ యజమాన్యం , మాట్లాడుతూ  “తల్లిపాలు బిడ్డకు ప్రాణదాయకం, పిల్లల శారీరక, మానసిక అభివృద్ధిలో తల్లిపాలు ఎంతో కీలకమైనవి. కనీసం 6 నెలల పాటు తల్లి పాలే ప్రధాన ఆహారంగా ఇవ్వడం శిశువు భవిష్యత్తు ఆరోగ్యానికి బలమైన అడుగులుగా నిలుస్తుంది. తల్లులు నిస్సంకోచంగా పిల్లలకు పాలివ్వాలని మనమందరం ప్రోత్సహించాలి.” మెడికవర్ హాస్పిటల్స్ ఈ వారంలో తల్లిపాలపై అవగాహన కలిగించే కార్యక్రమాలు నిర్వహిస్తూ, మాతృత్వాన్ని, శిశు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తు మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలు క్లస్టర్ హెడ్ డాక్టర్ వై. మహేశ్వర్ రెడ్డి చేతుల ద్వారా పిల్లల తల్లులకి  బేబీ కిట్స్ అందించారు.

About Author