NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రెండేళ్ల చిన్నారిని కాపాడిన వైద్యులు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  సెప్టెంబర్ 5,2025  గద్వాల్‌కు చెందిన మహేష్, జ్యోతి దంపతుల రెండేళ్ల కుమార్తె బేబీ గర్ల్  శివ రాణి ఇంట్లో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరింది. రోగి తండ్రి శస్త్రచికిత్సకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో వెళ్ళిపోతుండగా. చిన్నారి పరిస్థితి చూసి డాక్టర్ తన సొంత ఖర్చులతో ఆపరేషన్ చేసారు. బాలిక ఇంట్లో మెట్ల పక్కన టవల్‌తో ఆడుకుంటుండగా టవల్ ఆమెకు తగిలి మెట్లపై నుండి కిందపడింది. కిందపడినప్పుడు చిన్నారి తలకు రాయి తగలడంతో తీవ్ర మరియు వాంతులు అవ్వడంతో ఆమె తల్లిదండ్రులు వెంటనే గద్వాల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో వైద్యులు ఆమె ఆరోగ్య పరిస్థితిని నిలకడగా ఉంచడానికి గ్లూకోజ్ ఎక్కించారు. అనంతరం సిటీ స్కాన్ తీశారు.క్లిష్టమైన వైద్య పరిస్థితిలో అతి తక్కువ ఖర్చుతో, గద్వాల్‌కు చెందిన రెండేళ్ల చిన్నారి బ్రెయిన్ సర్జరీ విజయవంతంగా పూర్తయ్యింది. మెదడులో పెద్దగా గడ్డకట్టిన రక్తాన్ని తొలగించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ క్లిష్టమైన శస్త్రచికిత్సను కర్నూలులోని మెడికవర్ హాస్పిటల్స్‌లో నిపుణులైన వైద్య బృందం నిర్వహించింది.ఎలాంటి సమస్యలు రాకుండా ఉండటానికి సకాలంలో వైద్య సంప్రదింపులు తప్పనిసరి అని సూచించారు. మావద్ద  అనుభవజ్ఞులైన వైద్యులచే చికిత్స అందిస్తూ సరైన సమయంలో సరైన వైద్యం, అత్యాధునిక సదుపాయాలతో మన మెడికవర్ హాస్పిటల్స్ 24/7 అందుబాటులో ఉంటుంది.

About Author