NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సర్వం వాసుదేవమయం అనే అఖండ జ్ఞానమే ముక్తికి ఏకైక మార్గం

1 min read

డాక్టర్ దీవి హయగ్రీవాచార్యులు

 – ప్రముఖ ధార్మిక ప్రవచకులు.

అత్యంత వైభవంగా ప్రారంభమైన తితిదే ధార్మిక కార్యక్రమాలు

కర్నూలు, న్యూస్​ నేడు:  సర్వం వాసుదేవమయం అనే అఖండ జ్ఞానమే ముక్తికి ఏకైక మార్గమని, భారతీయ ఇతిహాసాలు, పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులన్నీ కూడా ఏకాత్మతా భావనను పెంచుతున్నాయని, ఆ భావననే దేశ ఐకమత్యానికి, పురోభివృద్దికి కారణంగా నిలుస్తున్నదని ప్రముఖ ధార్మిక ప్రవచకులు, తి.తి.దే. వ్యాఖ్యాత డాక్టర్ దీవి హయగ్రీవాచార్యులు అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మాభిచార పరిషత్తు ఆధ్వర్యంలో పాణ్యం మండలం, తొగడ్చేడు గ్రామంలోని శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానం నందు ఏర్పాటు చేసిన ధార్మిక కార్యక్రమాలలో భాగంగా వారు శ్రీమద్రామాయణంపై సుదీర్ఘ ప్రవచనం చేశారు. ఈ కార్యక్రమంలో హిందూధర్మ ప్రచారపరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, గ్రామ సర్పంచ్ చాకిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి , కాచిరెడ్డి రామకృష్ణారెడ్డి,  భజన గురువు వై. పి. బాలనాగిరెడ్డి, కాశిరెడ్డి రామాంజనేయ రెడ్డి, అర్చకులు అనంతరామయ్య, బాలసుబ్బారెడ్డి భజన బృందం, సి. తులసమ్మ, సి. విజయమ్మ, మంగలి లక్ష్మీదేవి, కె విజయమ్మ, ఇ. దేవమ్మతోపాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

About Author