భక్త కనకదాస్ విగ్రహ నిర్మాణం కోసం రూ.80 వేలు విరాళం
1 min read

హొళగుంద న్యూస్ నేడు: హోళగుంద మండలం ఎల్లార్తి గ్రామంలో సేవాభావంతో నిండిన ఒక మహత్తర కార్యక్రమం నేడు జరుగింది.గ్రామ అభివృద్ధి, ప్రజల ఐక్యత కోసం ఎల్లప్పుడూ ముందుండే హోళగుంద మండలం టీడీపీ సీనియర్ నాయకులు ఈ. గోవింద్ గౌడ్ అండ్ సన్స్ వారు, భక్త కనకదాస్ విగ్రహ నిర్మాణం కోసం రూ.80,000/- (ఎనభై వేల రూపాయలు)ను ఉదారంగా విరాళం అందించారు.ఈ స్ఫూర్తిదాయక కార్యక్రమంలో ఎల్లార్తి గ్రామ సర్పంచ్ దర్గన్న, గాదిలింగప్ప, మల్లికార్జునతో పాటు గ్రామ ప్రజలు నాయకుల సేవాభావాన్ని అభినందిస్తూ ఘన సన్మానం చేశారు. గ్రామంలో సామరస్యం, సోదరభావం బలపడే దిశగా ఈ కార్యక్రమం ఒక స్ఫూర్తి ప్రతీకగా నిలిచింది.ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకుడు ఈ. గోవింద్ గౌడ్ మాట్లాడుతూ“గ్రామ ప్రజలు కుల, మత భేదాలకు అతీతంగా ఐక్యంగా జీవించాలి. భక్త కనకదాస్ ఆశీర్వచనాలు ప్రతి ఇంటిపై ప్రసాదంగా నిలవాలి” అంటూ హృదయపూర్వక సందేశం ఇచ్చారు.కార్యక్రమంలో టీడీపీ మాజీ మండల కన్వీనర్ పి. వీరన్ గౌడ్, సీబీఎన్ ఆర్మీ ముళ్ళ మొయిన్,పెద్దహ్యట మల్లయ్య తదితర ప్రముఖులు పాల్గొని కార్యక్రమానికి విశిష్టత చేకూర్చారు.

