చిన్నహుల్తి గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ ను నియమించండి
1 min read

పత్తికొండ, న్యూస్ నేడు: పత్తికొండ మండల పరిధిలోని చిన్నహుల్తి,పెద్దహుల్తి, రెండు గ్రామాలు కలిపి చిన్న హుల్తీ గ్రామంలో ఉన్న సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ ను కేటాయించకపోవడంతో రెండు గ్రామాల ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కావున ఈ గ్రామాల సచివాలయంలో తక్షణమే డిజిటల్ నిర్మించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు డి. రాజా సాహెబ్, సిపిఐ మండల కార్యదర్శి యు.కారుమంచి, సిపిఐ సీనియర్ నాయకులు ఎం.కారన్న కోరారు. సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శి ఎం సిద్ద లింగప్ప అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రెండు గ్రామాలకు కలిపి ఒకటే సచివాలయం ఏర్పాటు చేసి, అందులో డిజిటల్ అసిస్టెంట్ ని కేటాయించకపోవడంతో గత ఏడు నెలలుగా గ్రామాల విద్యార్థులు, రైతులు సంక్షేమ పథకాలు కోసం దరఖాస్తు చేసుకోవడానికి సమస్యలు తలెత్తతున్నాయని అన్నారు. అలాగే రైతులు అడంగల్, టెన్ వన్, ఆర్ ఓ ఆర్, ఆర్హులైన నిరుపేదలకు రేషన్ కార్డులు, ఇంటి స్థలాలకు, విద్యార్థులకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవడానికి ఇబ్బందికరంగా మారిందని తెలిపారు. ఈ విషయంపై గతంలో అనేకమార్లు అధికారులకు తెలిపిన స్పందించలేదని ఆ విధంగా వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ నియమించాలని కోరారు. తదనంతరం ఎంపీడీవో కు వినిత పత్రం ఇచ్చారు. ఇప్పటికైనా చిన్న హుల్తీ సచివాలయానికి డిజిటల్ అసిస్టెంట్ ను నియమించాలని, నేను ఎడల రెండు గ్రామాల ప్రజలను, విద్యార్థులను కలుపుకొని ఎంపీడీవో ఆఫీసును ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి దూదేకొండ ఈరన్న (ఎంపీటీసీ), రైతు సంఘం పత్తికొండ నియోజకవర్గం కార్.

