డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరు నడుచుకోవాలి
1 min read

ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య(చంటి)
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, బోధిసత్య విశ్వవిజ్ఞాని బాబాసాహెబ్ డాక్టర్:బీమారావ్ రాజీ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను. స్థానిక పాత బస్టాండ్ సెంటర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం వద్ద నిరంతర కృషివలుడు.అంబేద్కర్ ఆశయ సాధన వారసుడు జై భీమ్ సేవా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు విప్పర్తి ప్రసాద్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) మాట్లాడుతూ డా:బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరు నడవాలని భారతదేశానికి చేసిన సేవలను కోనియడరు. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్, ఏపీ స్టేట్ మాల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు,ఏ.భాను ప్రతాప్ కమిషనర్ ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్, కోటా.ప్రభాకర్ రావు సీఈవో సెట్ వెల్,కె.రాజు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోలవరం ప్రాజెక్ట్, జి.సుధాకర్ ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్, తోట ఎడ్వర్డ్ ఈస్ట్,వెస్ట్ యoటియస్ ఉపాధ్యాయ సంఘ అధ్యక్షులు, ఎస్ శ్రీనివాసరావు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు గుజ్జుల ఏసోబు, ఏళ్ళ సౌజన్య కుమార్, జడ్పిటిసి నిట్టా లీలా నవకాంతం, ప్రముఖ వైద్యులు డా:అజయ్ చంద్ర, డా:షేక్ సయ్యద్ బాజీ ఏపీ నూర్ భాషా సంఘం నాయకులు,మరియు సిపిఎం,సిపిఐ,ఎస్ఎఫ్ఐ,రాష్ట్ర నాయకులు, రాష్ట్ర దళిత సంఘ నాయకులు పొలిమేర హరికృష్ణ , స్వచ్ఛంద సంస్థ నాయకులు,వివిధ శాఖల జిల్లా అధికారులు,అనధికారులు, రాజకీయ ప్రముఖులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా జై భీమ్ సేవా ట్రస్ట్ అధ్యక్షులు విప్పర్తి ప్రసాద్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన అధికారులకి,అనాధికారులకి, నా అభిమానులు, శ్రేయోభిలాషులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.

