NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డిఎస్ఎస్ మదర్ పేత్రా సేవలు చెరగని ముద్ర

1 min read

పేద,అనాధల జీవితాల్లో వెలుగులు

మదర్ పేత్రా స్పూర్తే మాకు ఆదర్శం

డిఎస్ఎస్ విమలాప్రొవైన్స్ సుపీరియర్ సిస్టర్ శిల్పా..

నందికొట్కూరు, న్యూస్​ నేడు: దీన సేవన సభ వ్యవస్థాపకులు మదర్ పేత్రా గారి ఆదర్శంతో ఎన్నో పేద, అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపాయి. అంతేకాదు ఆమె చేసిన సేవలూ నేటికీ కళ్ళకు అద్దంలా కనబడుతూ ఆమె సేవలు నేటికీ చెరగని ముద్రగా ఉన్నాయ్..

మధర్ పేత్రా కుటుంబ నేపధ్యం: జర్మనీలో ఓల్డే అనే చిన్న పట్టణానికి చెందిన పౌల రోజ్, బెర్నర్డ్ మోనింగ్మాన్ దంపతులకు ఆరుగురు సంతానం వీరిలో పేత్రా 3వ సంతానం.పేత్రా 14.6.1924 లో జన్మించారు.1969 జూన్ ఒకటిన డిఎస్ఎస్ సభను 8 మంది కన్యాస్త్రీలతో ప్రారంభించారు.చిన్నతనం నుండే దైవభక్తి ఎక్కువ. పేదలకు,అనాధలకు, రోగులకు నేనున్నాననే భరోసాను కల్పిస్తూ వారి దగ్గరికే వెళ్లి వారిని చేరదీస్తూ ఆదరించేవారు మదర్ పేత్రా.

1946 లో ఉర్సులిన్ కాన్వెంట్ లో చేరారు.1954 లో మొదటి మాటపట్టు పొందారు.

విస్తరించిన సభ:ఆంధ్ర,తెలంగాణలో కలిపి 26 డిఎస్ఎస్ కాన్వెంట్లు ఉన్నాయి.వీటిలో 132 మంది కన్యాస్త్రీలు ఉన్నారు అదేవిధంగాకేరళతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా సభ విస్తరించిందని సిస్టర్ శిల్పా అన్నారు.

నింగికెగిసిన మదర్ పేత్రా: పేదల అంధకార జీవితాల నుండి బయటకి తీసుకువచ్చిన డిఎస్ఎస్ వ్యవస్థాపకులు మదర్ పేత్రాదీన ప్రజల పట్ల దయ,ప్రేమ, గొప్ప నిశ్శబ్ద విప్లవంలా మారింది.52 సం.ల వయసు లో 1976 జూన్ 5వ తేదీన అనుకోకుండా మదర్ పేత్రా మరణించారు.

మదర్ పేత్రా స్పూర్తే ఆదర్శం:సిస్టర్ శిల్పా : సభ వ్యవస్థాపకులు మదర్ పేత్రా స్పూర్తే మాకు ఆదర్శనీయమని విమల ప్రొవైన్స్ సుపీరియర్ సిస్టర్ శిల్పా అన్నారు.పేత్రా అడుగుజాడల్లోనే సభ ముందడుగు వేస్తోందని అంతేకాకుండా పేదలకు,కుష్ఠు వ్యాధిగ్రస్తులకు,అభాగ్యులకు, హెచ్ఐవి చిన్నారులకు, దివ్యాంగులకు ఆరోగ్య, విద్యా,ఆర్థిక ఎకనామికల్ పరంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వారి జీవితాల్లో వెలుగు నింపే విధంగా మా సభ ముందుకు వెళ్తుందని సిస్టర్ శిల్పా అన్నారు

 – సిస్టర్ శిల్పా, దీన సేవన సభ ,  విమల ప్రొవైన్స్ సుపీరియర్, వెంకాయ పల్లె..కర్నూలు  మండలం.

About Author