విద్యార్థులు వ్యక్తిగత శుభ్రత అలవర్చుకోవాలి – ఎంఈఓ గంగిరెడ్డి
1 min read

చెన్నూరు , న్యూస్ నేడు : విద్యార్థిని విద్యార్థులు వ్యక్తిగత శుభ్రత తోపాటు పరిసరాలు పరిశుభ్రత పాటించాలని ఎంఈఓ గంగిరెడ్డి తెలిపారు. జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం లో భాగంగా ఆయన మంగళవారం మండల వైద్యాధికారి వినయ్ కుమార్ తో కలిసి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, ఆదిఆంధ్ర పాఠశాలను సందర్శించి అక్కడ విద్యార్థులకు ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు పాటించవలసిన నిబంధనలు గురించి మాట్లాడారు, విద్యార్థులు ఆరోగ్యవంతంగా ఉండేందుకు వారి రోజువారి ప్రక్రియలో ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి విద్యార్థులకు తెలియజేశారు . నులిపురుగుల నివారణ గురించి ఆయన విద్యార్థులకు తెలియజేస్తూ జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం లో భాగంగా పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు ఆల్బెండ జోల్ మాత్రలను ఇవ్వడం జరుగుతున్నదని తప్పక ఈ మాత్రలు విద్యార్థులు తీసుకోవాలని తెలియజేశారు. విద్యార్థులు నులిపురుగుల నివారణకు వ్యక్తిగత శుభ్రత పాటించవలెనని, అదేవిధంగా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాని తెలిపారు. అలాగే బయటకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా చెప్పులు ధరించి వెళ్లాలని విద్యార్థులకు సూచించారు. 19 సంవత్సరాల పిల్లలకు కిశోర బాలలకు ఈ ఆల్బెండజోల్ మాత్రలు ఉచితంగా అందజేయబడుతుందని ఆయన తెలిపారు. పాఠశాలకు గైర్హైజరైన విద్యార్థినీ విద్యార్థులకు ఆగస్టు 20న జరిగే మాస్ ఆఫ్ రోజుల్లో అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఏఎన్ఎంలు ఆశ వర్కర్లు విద్యార్థులు పాల్గొన్నారు.

