NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మాతృ శక్తి ఆధ్వర్యంలో దుర్గాష్టమి ఆయుధపూజ..

1 min read

కర్నూలు, న్యూస్ నేడు: విశ్వ హిందూ పరిషత్, మాతృశక్తి ఆధ్వర్యంలో  దుర్గాష్టమి సందర్భంగా శ్రీ సద్గురు త్యాగరాజ సీతారామాలయం, హరిశ్చంద్ర శరీన్ నగర్, కర్నూలు లో దుర్గాష్టమి ఆయుధపూజ కార్యక్రమంఈ రోజు ఉ. 11:00 గం.లకు నిర్వహించారు.ముఖ్య అతిథిగా విచ్చేసిన ఠాగూర్ పాఠశాల శ్రీమతి మంజుల మాట్లాడుతూ… హిందూ స్త్రీ లలో సామాజిక, మానసిక దృఢత్వం తక్కువగా ఉందని దీనివల్ల హిందూ యువతులకు అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయని దీనిని హిందూ యువతులు అధిగమించాలని అన్నారు. విశ్వహిందూ పరిషత్తు మాతృ శక్తి విభాగ్ కన్వీనర్ శ్రీమతి పావని మాళిగి మాట్లాడుతూ విశ్వహిందూ పరిషత్ లో యువతుల కోసం దుర్గా వాహిని మాతృమూర్తుల కోసం మాతృ శక్తి పేరుతో రెండు విభాగాలు ఉన్నాయని వీటి కేంద్రంగా యువతులకు కరాటే దండ యుద్ధ లాంటివి నేర్పిస్తారని మాతృమూర్తుల కోసం మన పండుగలు మన సంస్కృతి సంప్రదాయాలు సనాతన ధర్మం గురించి తెలియజేస్తుందని వివరించారు. అనంతరం జనవరి ఐదున జరిగిన హైందవ శంఖారావపు సభలో దేవాలయం స్వయం ప్రతిపత్తి కోసం చేసిన ప్రతిజ్ఞను దుర్గా వాహిని ప్రఖండ సంయోజిక కుమారి అశ్విని చేయించారు… ఈ కార్యక్రమంలో శ్రీమతి సోమ విజయలక్ష్మి , మహాలక్ష్మీ,ఉమాదేవి,దివ్య, రంగమ్మ, వెంకటేశ్వరమ్మ, వాణి, మంగమ్మ, పూజిత, లావణ్య, కవిత, పరిమళ,సాహితి, తదితరులు పాల్గొన్నారు.

About Author