NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా ఈద్ మిలాప్

1 min read

ముఖ్య అతిథిగా హాజరైన గౌరవ మంత్రివర్యులు శ్రీ TG భరత్ గుప్తా

కర్నూల్,  న్యూస్​ నేడు: పవిత్ర రంజాన్ పండుగ తరువాత రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు సూరి మన్సూర్ అలీ ఖాన్ ఏర్పాటు చేసిన ఈద్ మిలాప్ కార్యక్రమం పట్టణంలోని ఉర్దూ ఘర్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ TG భరత్ గుప్తా గారిని నిర్వాహకులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా ఆహ్వానించారు. ఆయన రాక వేడుకకు మరింత శోభను తీసుకొచ్చింది. కార్యక్రమానికి హాజరైన వారందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. మతసామరస్యానికి ప్రతీకగా ఈద్ మిలాప్ ను నిర్వహించడం అభినందనీయమన్నారు. వేడుకలో రుచికరమైన భోజనాన్ని ఏర్పాటు చేసి ఆప్యాయతలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు, వివిధ వర్గాల ప్రముఖులు, మాజీ కార్పొరేటర్లు, పోలీసులు, మీడియా ప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.

About Author