NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లాలో మత్తు పదార్థాల  రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి

1 min read

జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

కర్నూలు, న్యూస్​ నేడు : జిల్లాలో  మత్తు పదార్థాల రవాణా,వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్  కాన్ఫరెన్స్ హాల్ లో నార్కోటిక్స్ కో ఆర్డినేషన్ (NCORD) సమావేశాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలలలో, కళాశాలల్లో “say no to drugs” అనే పోస్టర్ లను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డిఈఓ ను ఆదేశించారు.  విద్యా సంస్థల వద్ద  మత్తు పదార్థాల విక్రయాలపై గట్టి నిఘా ఉంచాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.  ఆర్టీసీ బస్సు ల ద్వారా మత్తు పదార్థాల రవాణా జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆర్టీసీ ఆర్ ఎం ను ఆదేశించారు.జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ నగరంలో ఉన్నటువంటి చీకటి ప్రదేశాలలో కూర్చోవడానికి బెంచీలు ఏర్పాటు చేసి, మంచి లైటింగ్, పెయింటింగ్ మరియు CCTV కెమెరాలను అమర్చాలని తద్వారా సంబంధిత ప్రమాదకరమైన ప్రాంతాలు సురక్షితమైన ప్రదేశాలుగా మారిపోయే అవకాశం ఉంటుందన్నారు. ఎక్కడైనా గంజాయి సేవిస్తున్నట్లు లేదా విక్రయిస్తున్నట్లు అనుమానం వచ్చినట్లయితే వెంటనే పోలీస్ అధికారులకు సమాచారం చేరవేయాలని ఎస్పి అధికారులకు సూచించారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే అన్ని పాఠశాలల్లో గంజాయికి వ్యతిరేకంగా అవగాహన బోర్డులు, పోస్టర్లు ఏర్పాటు చేయాలన్నారు. గంజాయికి దూరంగా ఉండాలని మరియు సమాచారం ఉంటే 1972 నంబర్‌కు కాల్ చేయాలని తెలిపే పెద్ద బ్యానర్లను ప్రదర్శించాలన్నారు. సమావేశంలో  ఆర్టీసీ ఆర్ ఎం శ్రీనివాసులు, సెట్కుర్ సీఈవో వేణుగోపాల్, డిఇఓ సుధాకర్,  జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రాధిక, బీసీ వెల్ఫేర్ అధికారి ప్రసూన తదితరులు పాల్గొన్నారు.

About Author