NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సిఐటియు అఖిలభారత మహాసభలను జయప్రదం చేయండి

1 min read

హొళగుంద న్యూస్ నేడు : ఈనెల 31 నుండి జనవరి 4వ తేదీ వరకు జరుగు సిఐటియు అఖిలభారత 18వ మహాసభ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అరుణపతాక ఆవిష్కరించాలన్న రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు..వెంకటేష్ అద్యక్షతన  సీఐటీయూ మండల కార్యదర్శి నాగరాజు సీఐటీయూ జెండాను ఆవిష్కరించాడం జరిగింది  ఈ సందర్భంగా వెంకటేష్ నాగరాజు  మాట్లాడుతూ  మన రాష్ట్రం లో పారిశ్రామిక రాజధాని అయిన విశాఖ మహానగరంలో మొట్టమొదటిగా జరుగుతున్న సిఐటియు అఖిల భారత మహాసభలు జయప్రదం చేయాలని, దేశంలో కార్మికుల  సంక్షేమం కార్పొరేట్ చేతుల్లోకి వెళ్లిపోయిందని  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలలో రద్దు చేస్తూ కార్మికులను బానిసలుగా మార్చే సంస్కృతి తేస్తున్నారని పేర్కొన్నారు. ఆ సంఘటితంగా కార్మికులకు సమగ్ర కార్మిక చట్టం స్కీం వర్కర్లకు కనీస వేతనాలు అమలుపై సమరశీల పోరాటాలకు సిద్ధమవుదామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో హమాలీ హులిగప్ప నాగరాజు విరేష్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

About Author