విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
1 min read

- కర్నూలు జేఏసీ చైర్మన్ సతీష్ కుమార్
కర్నూలు, న్యూస్ నేడు: విద్యుత్ సంస్థలలో పని చేసే కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కర్నూలు జేఏసీ చైర్మన్ సతీష్ కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం నగరంలోని కర్నూలు సర్కిల్ ఆఫీస్ విద్యుత్ భవన్ ఎదురుగా రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా విద్యుత్ ఉద్యోగుల కర్నూలు జేఏసీ చైర్మన్ సతీష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 25వేల మందికి పైగా కాంట్రాక్ట్ పద్దతిలో విధులు నిర్వర్తిస్తున్నారని, వారందరికీ గౌరవ వేతనం ఇవ్వాలని, వారిని వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గ్రేట్ –2 జూనియర్ లైన్ మ్యాన్ పూర్తిగా విద్యుత్ శాఖలో విలీనం చేయాలని, విద్యుత్ కార్మికులు, వారి కుటుంబ సభ్యుల వైద్యం ఖర్చు ప్రభుత్వమే భరించాలన్నారు. అంతేకాక పెండింగ్ డీఏ లను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 15,16న నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపామని, 17,18న మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన తెలిపామని, గురు, శుక్రవారంలో రిలే నిరాహార దీక్ష చేపట్టామని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, లేదంటే ఉద్యమం తీవ్రతరం చేపడతామన్నారు. నిరసన దీక్ష లో విద్యుత్ ఉద్యోగుల నాయకులు బెళగల్ హుసేని, నాగ శేషులు, సయ్యద్ మున్వుర్ బాష, దేవ కుమార్, రజజినికాంత్, ఈశ్వర్, నబీ రసూల్, షఫీ అహ్మద్, రఫీ, మధు కుమార్ తదితరులు పాల్గొన్నారు.


