NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైస్సార్సీపీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ  ప్రజా ఉద్యమం

1 min read

ఆలూరు న్యూస్ నేడు:  ఆలూరు నియోజకవర్గంలో పెద్దఎత్తున వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు తో వైస్సార్సీపీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ  ప్రజా ఉద్యమం..   ముందుగా డాక్టర్ అంబేద్కర్ కు పూలమాల వేసి నివాళాలు ఆర్పించారు.  వైయస్​  జగన్ మోహన్ రెడ్డి  ఆదేశాల మేరకు ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి  ఆధ్వర్యంలో వైయస్సార్సీపి ప్రజా ఉద్యమం ర్యాలీ అంబేద్కర్ సర్కిల్ నుండి తహసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి  మాట్లాడుతూ. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు  దొంగ హామీలు చెప్పి , కానీ ఏ ఒక్క రోడ్డు వేయలేదు అభివృద్ధి చేయలేదు, ఎన్నికల ప్రచారం లో ఆలూరు కు వచ్చినప్పుడు ఆలూరును అభివృద్ధి చేస్తానని చెప్పి ఇప్పుడు మాత్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు_ వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు చంద్రబాబు నాయుడు  రోడ్డు వేసి అభివృద్ధి చేయమని మాట్లాడితే కేసులు పెట్టి పోలీసులని పంపిస్తారు. ఆలూరు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి పార్టీకి కంచుకోటగా ఉన్నందున చంద్రబాబు నాయుడు  అభివృద్ధి చేయాలని అనుకోవడం లేదు. వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు మీద టీడీపీ నాయకులు గ్రామాలలో గొడవలు సృష్టించకుండా ఆలూరును అభివృద్ధి చేయాలన్నారు. వైస్సార్సీపీ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విద్య వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిన మా నాయకుడు వైయస్ జగన్ రెడ్డి   వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చినాక 17 ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లను తీసుకొని వచ్చినారు.అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లోనే  5 మెడికల్ కాలేజీలను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎన్నికల అబ్జర్వర్   గుడ్డం సూర్య ప్రకాష్ రెడ్డి  వైస్సార్సీపీ మండల కన్వీనర్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గం కార్యవర్గ సభ్యులు, మండల కార్యవర్గ సభ్యులు,వైస్ ఎంపీపీ లు, ఎంపీటీసీ లు, కో కన్వీనర్లు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బివిఆర్​  అభిమానులు పాల్గొన్నారు.

About Author